Rishabh Pant: వారెవ్వా పంత్ .. ఇలా కూడా బ్యాటింగ్ చేస్తాడా.. వీడియో వైరల్ (video)

Rishabh Pant

సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా ఎతో జరిగిన రెండో సన్నాహక పోరులో టీమిండియా ఆటగాళ్ళు ఆదగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్‌ 50కి పైగా రన్స్ చేశారు.

  • Share this:


    సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా ఎతో జరిగిన రెండో సన్నాహక పోరులో టీమిండియా ఆటగాళ్ళు ఆదగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్‌ 50కి పైగా రన్స్ చేశారు. హనుమ విహారి (104 నాటౌట్‌), రిషబ్‌ పంత్‌ (103 నాటౌట్‌) సెంచరీలతో ఆదరగొట్టారు. ఐపీఎల్‌లో దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. టీ20,వన్డే మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం రాకపోయే సరికి ఆసీస్‌కు పర్యాటకుడిలా వెళ్ళాడని పలువురు ఆరోపణలు కూడా చేశారు. ఇక ఆసీస్ ఎతో జరిగిన సన్నహాక మ్యాచ్‌లో పంత్ విజృభించాడు. టీ20 తరహాలో రెచ్చిపోయాడు. 73 బంతుల్లోనే సెంచరీ చేసి ఆదగొట్టాడు.







    విల్డర్‌మత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 90వ ఓవర్లో పంత్‌ ఒక్కడే నాలుగు ఫోర్లు, సిక్సర్‌ బాది 22 రన్స్‌ రాబట్టాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో హనుమ విహారికిది 21వ శతకం బాదాడు. మయాంక్‌ అగర్వాల్ ‌(61), శుభ్‌మన్‌ గిల్‌ (65), కెప్టెన్ అజింక్య రహానె (38) గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కొన్నారు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముందు 86 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. పృథ్వీ షా (3) ఆరంభంలో వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత మయాంక్‌ అగర్వాల్ ‌(61), శుభ్‌మన్‌ గిల్‌ (65), కెప్టెన్ అజింక్య రహానె (38) గులాబీ బంతితో విజయవంతంగా రాణించారు.



    రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నష్టపోయి 386 పరుగులు చేసింది. మెుదటి ఇన్నింగ్స్‌లో లభించిన 82 పరుగుల అధిక్యంతో కలుపుకుని 472 పరుగులతో లీడ్‌లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ పంత్‌ కసిగా ఆడాడు. పరిమిత ఓవర్ల మాదిరిగా 73 బంతుల్లోనే మెరుపు శతకం సాధించాడు. రెండో రోజు ఆఖరి ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ దాటిగా ఆడి 22 పరుగులు సాధించాడు. ఈ మెరుపు బ్యాటింగ్ తనపై విమర్శలు చేస్తున్న వారికి ధీటైనా సమాధానాన్ని ఇచ్చాడు. దీంతో అతనికి తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
    Published by:Rekulapally Saichand
    First published: