India vs Afghanistan | టీమిండియా తడబ్యాటు...రోహిత్, రాహుల్ ఔట్...

India vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. 19 ఓవర్లకు భారత్ 79/2 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం ఒక పరుగుకే ఔటయ్యాడు. అలాగే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం 30 పరుగులకే ఔటయ్యాడు.

news18-telugu
Updated: June 22, 2019, 5:33 PM IST
India vs Afghanistan | టీమిండియా తడబ్యాటు...రోహిత్, రాహుల్ ఔట్...
1 పరుగుకే ఔటైన రోహిత్ శర్మ
  • Share this:
India vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: సౌతంప్టన్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. 19 ఓవర్లకు భారత్ 79/2 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం ఒక పరుగుకే ఔటయ్యాడు. అలాగే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం 30 పరుగులకే ఔటయ్యాడు. ఓపెనర్లు వెనుదిరగడంతో స్కోరు బోర్డును నడిపించే బాధ్యతను కెప్టెన్ కోహ్లీ, విజయ్ శంకర్ లపై పడింది.

ఇదిలా ఉంటే, తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న టీమిండియాకు ఆఫ్గనిస్థాన్ పై పూర్తి సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఆఫ్గనిస్థాన్ ఎలాగైనా ఒక మ్యాచ్ గెలిచి సంచలనం సృష్టించాలని కలలు కంటోంది. అయితే టీమిండియా నుంచి శిఖర్ ధావన్ గాయంతో వరల్డ్ కప్ నుంచి వైదొలగడంతో ఓపెనింగ్ బాధ్యతను కేఎల్ రాహుల్ మీద పడింది. పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో రోహిత్ తో కలిసి ఓపెనింగ్ బాధ్యత తలకెత్తకున్న కేఎల్ రాహుల్ అర్థసెంచరీతో రాణించాడు. అలాగే ఈ మ్యాచ్ లో తుది జట్టులో బౌలర్ మహ్మద్ షమి కూడా జతయ్యాడు.
Published by: Krishna Adithya
First published: June 22, 2019, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading