India vs Afghanistan | కోహ్లీ ఔట్...4 వికెట్లు కోల్పోయిన భారత్...పట్టు బిగించిన ఆఫ్గన్ బౌలర్లు...

India vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదులుతోంది. 36 ఓవర్లకు భారత్ 152/4 పరుగులు చేసింది.

news18-telugu
Updated: June 22, 2019, 5:31 PM IST
India vs Afghanistan | కోహ్లీ ఔట్...4 వికెట్లు కోల్పోయిన భారత్...పట్టు బిగించిన ఆఫ్గన్ బౌలర్లు...
67 పరుగులు వద్ద కోహ్లీ ఔట్
  • Share this:
India vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: సౌతంప్టన్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదులుతోంది. 36 ఓవర్లకు భారత్ 152/4 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం ఒక పరుగుకే ఔటయ్యాడు. అలాగే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం 30 పరుగులకే ఔటయ్యాడు. ఓపెనర్లు వెనుదిరగడంతో స్కోరు బోర్డును నడిపించే బాధ్యత కెప్టెన్ కోహ్లీపై పడింది. దీంతో కోహ్లీ నెమ్మదిగా ఆడుతూనే 67 పరుగులు చేసి 30వ ఓవర్లో ఔటయ్యాడు. అయితే మరో బ్యాట్స్ మెన్ విజయ్ శంకర్ సైతం 29 పరుగులకే ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్ ఆడుతున్నారు.

ఇదిలా ఉంటే, తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న టీమిండియాకు ఆఫ్గనిస్థాన్ పై పూర్తి సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఆఫ్గనిస్థాన్ ఎలాగైనా ఒక మ్యాచ్ గెలిచి సంచలనం సృష్టించాలని కలలు కంటోంది. అయితే టీమిండియా నుంచి శిఖర్ ధావన్ గాయంతో వరల్డ్ కప్ నుంచి వైదొలగడంతో ఓపెనింగ్ బాధ్యతను కేఎల్ రాహుల్ మీద పడింది. పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో రోహిత్ తో కలిసి ఓపెనింగ్ బాధ్యత తలకెత్తకున్న కేఎల్ రాహుల్ అర్థసెంచరీతో రాణించాడు. అలాగే ఈ మ్యాచ్ లో తుది జట్టులో బౌలర్ మహ్మద్ షమి కూడా జతయ్యాడు.
Published by: Krishna Adithya
First published: June 22, 2019, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading