World Cup 2019: ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా రికార్డు.. ఏయే దేశాలు ఏ స్థానంలో ఉన్నాయంటే..

ICC Cricket World Cup 2019: టీమిండియా మినహా అన్ని దేశాలు ఏదో ఒక మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాయి. నిన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోయిన న్యూజిలాండ్ కూడా.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 27, 2019, 12:24 PM IST
World Cup 2019: ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా రికార్డు.. ఏయే దేశాలు ఏ స్థానంలో ఉన్నాయంటే..
టీమిండియా సభ్యులు ( Image : Twitter)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 27, 2019, 12:24 PM IST
క్రికెట్ ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని మ్యాచ్‌లను వాన ఎగరేసుకుపోగా, మిగతా మ్యాచులన్నీ ఉత్కంఠను కలిగిస్తున్నాయి. లీగ్ దశ దాదాపు పూర్తి కావస్తోంది. భారత్ మినహా అన్ని దేశాలు 6, 7 మ్యాచ్‌లు ఆడాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఓడిపోని దేశమేదైనా ఉందంటే.. అది భారతే. టీమిండియా మినహా అన్ని దేశాలు ఏదో ఒక మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాయి. నిన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోయిన న్యూజిలాండ్ కూడా.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. భారత్ మాత్రమే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాపై గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఏయే దేశాలు ఏ స్థానంలో ఉన్నాయని ఓ సారి పరిశీలిస్తే.. 7 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 6 విజయాల(12 పాయింట్లు)తో తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ 7 మ్యాచ్‌లు ఆడగా, ఐదింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఆ జట్టు 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో భారత్ 9 పాయింట్లు(5 మ్యాచ్‌లు), నాలుగో స్థానంలో ఇంగ్లండ్ 8 పాయింట్లు (7 మ్యాచ్‌లు), బంగ్లాదేశ్ 5వ స్థానంలో (7 పాయింట్లు), పాకిస్తాన్ 6వ స్థానంలో (7 పాయింట్లు), శ్రీలంక 7వ స్థానంలో, వెస్టిండీస్ 8వ స్థానంలో, దక్షిణాఫ్రికా 9వ స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉన్నాయి.ః

cricket world cup, world cup, time table, standings, india place in table, australia vs pakistan, aus vs pak, ausvpak, world cup match, ind vs nz,India vs New Zealand, world cup 2019, Icc world-cup 2019 schedule, Worldcup 2019 India schedule, Team india score card, warm up match,indvsnz, IndvNZ, ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఫించ్, సర్ఫరాజ్, finch, surfaraj, ఇండియా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, వరల్డ్‌కప్ 2019 క్రికెట్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ kohli, virat kohli, steve smith, smith, cricket world cup, world cup 2019, world cup, cricket, team india, india vs australia, విరాట్ కోహ్లీ, కోహ్లీ, స్వీవ్ స్మిత్, 2019 వరల్డ్ కప్, వరల్డ్ కప్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, భారత్, ఆస్ట్రేలియా, ధోని, కోహ్లీ,
క్రికెట్ వరల్డ్‌కప్ ట్విట్టర్ ఫోటో


First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...