IND vs SA : టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్..

IND vs SA : టీమిండియా చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టెస్టులకు మూడు టెస్టులను గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మూడో టెస్టులో భాగంగా నాలుగో రోజు మరో రెండు వికెట్ల వేటకు దిగిన టీమిండియా రెండో ఓవర్‌లోనే ఆ రెండు వికెట్లను తీసింది.

news18-telugu
Updated: October 22, 2019, 10:29 AM IST
IND vs SA : టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్..
టీమిండియా ఘన విజయం
  • Share this:
టీమిండియా చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టెస్టులకు మూడు టెస్టులను గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మూడో టెస్టులో భాగంగా నాలుగో రోజు మరో రెండు వికెట్ల వేటకు దిగిన టీమిండియా రెండో ఓవర్‌లోనే ఆ రెండు వికెట్లను తీసింది. ఈ రోజు రెండో ఓవర్ వేసిన నదీమ్ వరుస బంతుల్లో బ్రైన్, ఎంగిడిని అవుట్ చేయడంతో టీమిండియా విజయపతాక ఎగురవేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైన సఫారీలు ఫాలో ఆన్ ఆడి.. 133 పరుగులకే కుప్పకూలారు. కాగా, ఉమేశ్‌, షమి, అశ్విన్‌, జడ్డూ, నదీమ్‌ బంతితో విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒకే రోజున(టెస్టు 3వ రోజు) 16 వికెట్లు చేజార్చుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, ఈ టెస్టు సిరీస్‌లో సెంచరీలు, డబుల్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ , మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. కాగా.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 5 టెస్టుల్లో 240 పాయింట్లు సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక చెరో 60 పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 22, 2019, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading