IND vs SA: మెరిసిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఘన విజయం..

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 19, 2019, 6:21 AM IST
IND vs SA: మెరిసిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఘన విజయం..
విరాట్ కోహ్లీ, ధవన్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 19, 2019, 6:21 AM IST
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 150 పరగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పపరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 72 నాటౌట్‌(4ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా, ఓపెనర్ శిఖర్ ధవన్(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) తన బ్యాట్‌కు పని చెప్పాడు. భారత బ్యాటింగ్‌లో రోహిత్ (12), రిషబ్ పంత్ నిరాశపరిచారు. వీరిద్దరి తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కోహ్లీకి జతగా నిలిచాడు. మరోవైపు, కోహ్లీ దూకుడుగా ఆడి 72 పరుగులు చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మన బౌలర్లలో దీపక్‌ చహర్‌ రెండు వికెట్లు, సైనీ, జడేజా, హార్దిక్‌ పాండ్యాలు తలో వికెట్‌ తీశారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 తో పై చేసి సాధించింది.


First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...