విరాట్ కోహ్లీ సెంచరీ.. 241 పరుగుల లీడ్‌లో టీమిండియా..

IND vs BAN : తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 106 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టి 349/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

news18-telugu
Updated: November 23, 2019, 5:29 PM IST
విరాట్ కోహ్లీ సెంచరీ.. 241 పరుగుల లీడ్‌లో టీమిండియా..
విరాట్ కోహ్లీ సెంచరీ
  • Share this:
టీమిండియా జోరు కొనసాగిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీ సేన బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ దూసుకుపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 106 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టి 349/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. 194 బంతుల్లో 18 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. అయితే.. పుజారా (55), రహానే (51) మినహా ఎవ్వరూ అంతగా రాణించలేదు. కోహ్లీ అవుట్ అయ్యాక వికెట్లను టపటపా కోల్పోయింది. ఉమేశ్ యాదవ్, ఇషాంత శర్మ డకౌట్‌గా వెనుదిరిగారు.

అటు.. బంగ్లా బౌలర్లలో అమిన్ హుస్సేన్ 3, ఎబాదత్ హుస్సేన్ 3, జయేద్ 2, ఇస్లాం 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక, బంగ్లా జట్టు రెండో ఇన్నింగ్ కూడా మొదలెట్టేసింది. బ్యాటింగ్ మొదలు పెట్టిన కాసేపటికే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఓపెనర్ షాద్నం ఇస్లాం, మొమినుల్ హక్ డకౌట్ అయ్యారు.First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>