టీమిండియాకు ఆరెంజ్ రంగు జెర్సీ.. రాజకీయ సెగ పుట్టించిన..

ICC CRICKET WORLD CUP | INDIA VS ENGLAND | బీజేపీ జెండా కాషాయం.. నారింజ దాదాపు ఒకటే కావడంతో టీమిండియా జెర్సీపై కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని కాషాయీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 27, 2019, 7:06 AM IST
టీమిండియాకు ఆరెంజ్ రంగు జెర్సీ.. రాజకీయ సెగ పుట్టించిన..
ఆరెంజ్ రంగు జెర్సీ
  • Share this:
ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఈ నెల 30 ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో భారత జట్టు ఆరెంజ్ రంగు జెర్సీని ధరించబోతోంది. వాస్తవానికి టీమిండియా జెర్సీ నీలి రంగులో ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లోనూ అదే రంగు జెర్సీతో ఆడుతోంది. ఇంగ్లండ్ జట్టుది కూడా నీలి రంగు జెర్సీనే. ఐసీసీ నిబంధనల ప్రకారం వరల్డ్ కప్‌లో రెండు జట్లు ఒకే రంగు జెర్సీని ధరించరాదు. అందువల్ల ఏదో ఒక జట్టు జెర్సీ రంగును మార్చుకోవాలి. ఇంగ్లండ్ ఆతిథ్య జట్టు కాబట్టి ఆ జట్టు తమ జెర్సీని అలాగే ఉంచుకోవచ్చు. అయితే, ఇప్పుడు వచ్చిన సమస్యల్లా.. టీమిండియా సభ్యులు ధరించే జెర్సీ నారింజ రంగు కావడమే అసలు సమస్య. బీజేపీ జెండా కాషాయం.. నారింజ దాదాపు ఒకటే కావడంతో టీమిండియా జెర్సీపై కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని కాషాయీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్‌కు ఎస్పీ మద్దతు పలికింది. ‘దేశం మొత్తాన్నీ కాషాయీకరించాలని ప్రధాని మోదీ తపిస్తున్నారు. జెర్సీలకు మువ్వన్నెల రంగులను ఎంచుకోవచ్చు కదా. ఇప్పుడు క్రీడా రంగంలోనూ కాషాయీకరణ ప్రారంభమైంది.’ అని ఆయన ఆరోపించారు. అయితే, కాంగ్రెస్‌, ఎస్పీ ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది. కాగా, బీసీసీఐ ఇష్టప్రకారమే టీమిండియాకు ఆరెంజ్ కలర్‌ను కేటాయించామని ఐసీసీ వివరించింది.

First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు