రిటైరయ్యాక కూడా సచిన్ నో బాల్ వేశాడన్న అంపైర్.. ఐసీసీ ట్వీట్‌కు..

కాంబ్లీకి సచిన్ లెగ్ స్పిన్ బౌలింగ్ వేసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే, క్రీజు దాటి వేసిన దృష్యాన్ని పసిగట్టిన ఐసీసీ.. ‘మీ ఫ్రంట్ ఫుట్ చూసుకోండి.. అది నో బాల్’ అంటూ ట్వీట్ చేసింది.

news18-telugu
Updated: May 16, 2019, 2:29 PM IST
రిటైరయ్యాక కూడా సచిన్ నో బాల్ వేశాడన్న అంపైర్.. ఐసీసీ ట్వీట్‌కు..
సచిన్
news18-telugu
Updated: May 16, 2019, 2:29 PM IST
క్రికెట్ ప్రపంచానికి దేవుడు.. సచిన్ టెండూల్కర్. రెండు దశాబ్దాల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 2013లో రిటైర్ అయిన సచిన్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో సొంత జట్టు ముంబై ఇండియన్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాడు. ఇక, అంపైర్ల కాంట్రవర్సీ ఔట్లకు ఎక్కువగా బలైంది సచినేనని చెప్పడంలో ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల 99 రన్స్ వద్ద ఎన్నో సార్లు ఔట్ అయ్యి అసహనంతో వెనుదిరిగాడు. అయితే, సచిన్ రిటైర్ అయ్యాక కూడా అంపైర్ వదలకపోవడం విశేషం. అదెలా అనుకుంటున్నారా.. నవీ ముంబైలోని టెండూల్కర్-మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ క్యాంప్‌లో సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ఆడారు. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని, తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులుగా ఆడలేదని తెలిపారు. దానికి తగ్గట్లు కాంబ్లీకి సచిన్ లెగ్ స్పిన్ బౌలింగ్ వేసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే, క్రీజు దాటి వేసిన దృష్యాన్ని పసిగట్టిన ఐసీసీ.. ‘మీ ఫ్రంట్ ఫుట్ చూసుకోండి.. అది నో బాల్’ అంటూ ట్వీట్ చేసింది.

దానికి సచిన్ చాలా చమత్కారంగా బదులిచ్చాడు. ‘హమ్మయ్య కనీసం ఈ సారి నేను బౌలింగ్ వేశా. బ్యాటింగ్ అయితే చేయలేదు. ఏదేమైనా అంపైర్ నిర్ణయమే ఫైనల్’ అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు క్షణాల్లోనే వేలాది లైకులు, రీట్వీట్లు వచ్చాయి.
Loading...


First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...