Cricket Latest News | జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆ జట్టును సస్పెండ్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం మితిమీరినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తున్నట్లు తెలిపింది.
ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ...ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
కొన్నేళ్ల క్రితం ప్రపంచ మేటి జట్లను కూడా మట్టికరిపించిన జింబాబ్వే...అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఆ జట్టులోని కొందరు ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ప్రశంసలు పొందారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా క్రమంగా ఆ జట్టు ప్రభను కోల్పోయింది. క్రికెట్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు ఉన్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.