ICC Cricket World Cup 2019: సచిన్‌ను గుర్తుకు తెచ్చిన రోహిత్ శర్మ.. ఇద్దరూ ఒకే దేశంపై, ఒకేలా..

ICC Cricket World Cup 2019 | India vs Pakistan | ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ అద్భుత సన్నివేశం సచిన్‌ను గుర్తుకు తెచ్చింది. ఆ మ్యాచ్‌లో స్క్వయర్ కట్ డ్రైవ్ ఆడిన రోహిత్.. సిక్స్ బాదాడు. ఇది అచ్చం 2003లో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్ కొట్టిన షాట్ లాగే ఉంది. ఆ మ్యాచ్‌లో కూడా సచిన్ స్క్వయర్ కట్ ఆడి సిక్స్ బాదాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 18, 2019, 10:50 AM IST
ICC Cricket World Cup 2019: సచిన్‌ను గుర్తుకు తెచ్చిన రోహిత్ శర్మ.. ఇద్దరూ ఒకే దేశంపై, ఒకేలా..
సచిన్, రోహిత్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 18, 2019, 10:50 AM IST
రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టాడంటే రికార్డులు బద్దలవ్వాల్సిందే. కొత్త రికార్డులు వచ్చి అతడి అకౌంట్లో వచ్చి చేరాల్సిందే. అతడు కొట్టే ప్రతీ షాట్ ప్రత్యేకమే. బాల్‌కు తగ్గ షాట్ కొట్టి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. పరుగుల వరద పారించేవాడు. షార్ట్ బాల్‌ను అప్పర్ కట్ షాట్ ఆడాలన్నా, సరళ రేఖ గీసినట్లు స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టాలన్న అది సచిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. సచిన్ కొట్టిన షాట్లలో ప్రస్తుత బ్యాట్స్‌మెన్ 60 శాతమే ఆడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. సచిన్ బాల్‌ను బాదే తీరు. సచిన్ తర్వాత అంతటి పర్‌ఫెక్ట్ షాట్లు ఆడటంలో కోహ్లీ, రోహిత్ ముందు వరుసలో ఉంటారు. ఓ సందర్భంలో ‘మీ రికార్డులను ఎవరు బద్దలు కొట్టే అవకాశం ఉంది?’ అని ప్రశ్నించగా వీరిద్దరి పేర్లే చెప్పాడు సచిన్. అంటే.. వీరిద్దరి షాట్ల ఎంపిక తనలాగే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. సచిన్ అనుకున్నట్లుగానే కోహ్లీ, రోహిత్ తమ వీర బాదుడుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.

అయితే, ఆదివారం జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ అద్భుత సన్నివేశం సచిన్‌ను గుర్తుకు తెచ్చింది. ఆ మ్యాచ్‌లో స్క్వయర్ కట్ డ్రైవ్ ఆడిన రోహిత్.. సిక్స్ బాదాడు. ఇది అచ్చం 2003లో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్ కొట్టిన షాట్ లాగే ఉంది. ఆ మ్యాచ్‌లో కూడా సచిన్ స్క్వయర్ కట్ ఆడి సిక్స్ బాదాడు. దీంతో ఆ రెండు సన్నివేశాలను కలుపుతూ ఐసీసీ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియో కింద ఎవరు బాగా ఆడారు? అని ప్రశ్న కూడా వేసింది. అయితే, రెండు షాట్లు ఒకేలా ఉండటంతో ఎవరు బాగా ఆడారో తేల్చుకోలేక అభిమానులు తికమక పడుతున్నారు.

ఆ వీడియోపై స్పందించిన సచిన్.. ‘మేమిద్దరం భారతీయులమే. పైగా ముంబైకి చెందిన వాళ్లం. అంటే.. బొమ్మ పడితే నేను ఆ షాట్ బాగా ఆడినట్లు , బొరుసుపడితే రోహిత్ బాగా ఆడలేనట్లు’ అంటూ సూపర్ డూపర్ రిప్లై ఇచ్చాడు.






 
Loading...



View this post on Instagram




 

Sachin in 2003 or Rohit in 2019 – who did it better? #lovecricket #cricket #CWC19


A post shared by ICC (@icc) on








First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...