IND vs NZ: మ్యాచ్ పూర్తిగా జరిగితే ఇండియాకు లాభమా? నష్టమా?

ICC Cricket World Cup 2019 | IND vs NZ | ఈ రోజు మ్యాచ్ పూర్తిగా జరిగితే భారత్‌కు నష్టమా? లాభమా? అని ఓసారి పరిశీలిస్తే.. టీమిండియా జట్టు ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాల్సిందే.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 2:45 PM IST
IND vs NZ: మ్యాచ్ పూర్తిగా జరిగితే ఇండియాకు లాభమా? నష్టమా?
పిచ్ (ట్విట్టర్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 2:45 PM IST
ప్రపంచకప్‌లో తొలి సెమీ ఫైనల్ సమరం రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ 46.1 ఓవర్లు ఆడింది. 4.57 రన్ రేట్‌తో 211 పరుగులు చేసింది. ఆ జట్టులో కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే వర్షం పడటంతో నిన్నటి మ్యాచ్ నేటికి వాయిదా పడింది. చివరి ఓవర్లలో హిట్టింగ్ చేసి భారత్‌కు భారీ టార్గెట్ ఇవ్వాలని కివీస్ జట్టు యోచిస్తోంది. పిచ్ పరిస్థితిని బట్టి మరో 30-40 పరుగులు చేసే అవకాశం ఉంది. అయితే, ఈ రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఈ రోజు మ్యాచ్ పూర్తిగా జరిగితే భారత్‌కు నష్టమా? లాభమా? అని ఓసారి పరిశీలిస్తే.. టీమిండియా జట్టు ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాల్సిందే. ఎందుకంటే.. వర్షం పడినందువల్ల పిచ్ తడిగా మారుతుంది. అవుట్ ఫీల్డ్ మొత్తం వెట్‌గా తయారవుతుంది. అదీకాక వాతావరణ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తాయి.

కివీస్ జట్టులో వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని రెచ్చిపోయే బౌల్ట్, ఫెర్గ్యూసన్ ఉండనే ఉన్నారు. బీభత్సమైన స్వింగ్‌తో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే అవకాశం లేకపోలేదు. పోనీ.. వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్, బౌండరీలతో నెట్టుకొద్దామన్నా.. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల బంతి వేగం తగ్గుతుంది. అన్నింటికీ మించి పిచ్ నెమ్మదిస్తోంది.

పోనీ.. మధ్యలో వర్షం పడి డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యం చేధించాల్సి వస్తే.. రన్ రేట్ 6 కి మించిన లక్ష్యం మన బ్యాట్స్‌మెన్ ముంగిట ఉంటుంది. ఈ క్రమంలో తొలి ఓవర్లలోనే వికెట్లు పడితే అంతే ఇక. లక్ష్యం కొండంతలు పెరిగిపోతుంటే.. రన్ రేట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. మ్యాచ్ జరిగే కంటే.. వర్షం పడితే మేలు అనుకోవడం మంచిది. లేకపోతే పూర్తి మ్యాచ్ జరగడం ఉత్తమం. ఈ రెండూ కాక.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారమైతే భారత్‌కే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...