IND vs NZ: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ఆలస్యం కానున్న టాస్

ICC Cricket World Cup 2019: ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం వల్ల మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 13, 2019, 2:53 PM IST
IND vs NZ: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ఆలస్యం కానున్న టాస్
వర్షం కారణంగా నిలిచిన టాస్ (ట్విట్టర్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 13, 2019, 2:53 PM IST
వరల్డ్ కప్ వాన కప్‌గా మారిపోయింది. మ్యాచ్‌లు జరగకుండా వానలు అడ్డుపడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో మైదానాలన్నీ చిత్తడిగా మారిపోతున్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు వర్షార్పణం కాగా, నేటి భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారింది. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైతే చెరో పాయింట్‌ లభిస్తుంది. ఇది న్యూజిలాండ్‌కు లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్‌ ఇప్పటికే మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. కివీస్ ఏడు పాయింట్లు సాధిస్తే సెమీస్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువవుతాయి. ఇక మిగిలిన ఐదింటిలో మూడు గెలిచినా.. సెమీస్‌లో తొలి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని సొంతం చేసుకుంటుంది.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...