World Cup 2019: సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే..

icc cricket world cup 2019 | భారత్ ఓడిపోవడానికి కారణాలను ఓ సారి పరిశీలిస్తే.. మొదటి కారణం వాతావరణమే. అప్పటికే వర్షం పడి పిచ్ తడిగా మారింది. వర్షం తగ్గినా, మబ్బులు ఆవరించి ఉండటంతో గాలిలో తేమ ఎక్కువగా ఉంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 11, 2019, 12:37 PM IST
World Cup 2019: సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే..
ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 11, 2019, 12:37 PM IST
వరల్డ్ కప్ హాట్ ఫేవరేట్ జట్లలో భారత్‌ది తొలి స్థానం. పలువురు మాజీలైతే ఏకంగా.. టీమిండియాను ఓడించిన వారిదే ప్రపంచకప్ అని, కోహ్లీ సేనపై తమకున్న నమ్మాకాన్ని చాటారు. బ్యాటింగ్ దుర్భేద్యం.. బౌలింగ్ పదును.. ఫీల్డింగ్ చురుకు.. వెరసి సూపర్ పవర్‌గా వరల్డ్ కప్‌లోకి అడుగు పెట్టింది టీమిండియా. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్.. ఇలా ఒక్కో జట్టుపై ఆధిపత్యం చెలాయించారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు కాగా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. 15 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. అయితే, సెమీఫైనల్‌లో బోర్లా పడింది. వరుణుడు అన్యాయం చేయగా, పిచ్ సహకరించడంతో న్యూజిలాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. రవీంద్ర జడేజా, ధోని పోరాడినా.. మరో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో టీమిండియా ఆలౌట్ అయ్యింది. కివీస్ వరుసగా రెండో సారి సగర్వంగా ఫైనల్‌లో అడుగు పెట్టింది.

india vs new zealand,india vs new zealand semi final world cup 2019,world cup 2019,india vs new zealand semi final,india vs new zealand live,india vs new zealand 2019,india vs new zealand semifinal,india vs new zealand playing 11,world cup,icc world cup 2019,icc cricket world cup 2019,new zealand vs india,cricket world cup 2019,ind vs nz,india vs new zealand live match,manchester weather report,manchester,manchester weather,manchester weather forecast,weather in manchester,weather in manchester england,weather forecast in ind vs nz match at manchester,weather manchester,weather at manchester,weather manchester uk,weather at manchester today,weather report of manchester,weather updates at manchester,met office weather manchester,current weather manchester uk,weather forecast,మాంచెస్టర్,ఇండియా వర్సెస్ న్యూజిలాండ్,వరల్డ్ కప్ 2019 ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్,
ఫైనల్లోకి న్యూజిలాండ్


అసలు భారత్ ఓడిపోవడానికి కారణాలను ఓ సారి పరిశీలిస్తే.. మొదటి కారణం వాతావరణమే. అప్పటికే వర్షం పడి పిచ్ తడిగా మారింది. వర్షం తగ్గినా, మబ్బులు ఆవరించి ఉండటంతో గాలిలో తేమ ఎక్కువగా ఉంది. మరోవైపు, అవుట్ ఫీల్డ్ పచ్చిగానే ఉంది. వీటన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకున్న కివీస్ ఫాస్ట్ బౌలర్లు స్వింగ్‌తో బెంబేలెత్తించారు. బంతిని తాకడమే లేటు.. వెంటనే బంతి ఫీల్డర్ చేతిలోకి చేరిపోయింది. అలా భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్ తడబడ్డారు.

ఇక, కివీస్ ఫీల్డింగ్ అద్భుతం.. విలియమ్‌సన్ సేన ఏ దశలోనూ మ్యాచ్‌ను జారవిడుచుకోలేదు. జేమ్స్ నిషామ్ పట్టిన క్యాచ్ సూపర్. అన్నింటికంటే.. ధోనీని గప్టిల్ చేసిన రనౌట్ ఆ జట్టును ఫైనల్‌కు చేర్చింది. లేకపోయి ఉంటే ఈ పాటికి కివీస్ జట్టు ఇంటి బాట పట్టి ఉండేది. తాను నాటౌట్‌గా ఉన్న సమయాల్లో 47 సార్లు జట్టును విజయతీరాలకు చేర్చిన ధోని.. మరోసారి ఫైనల్‌ చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, ఆ రనౌట్ కారణంగా భారత జట్టు ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది.




జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నపుడు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా చూపిన సహనం గురించి చర్చించుకోవాల్సిందే. వారిద్దరు సింగిల్స్‌కే పరిమితమయ్యారు. అయితే, స్కోరు అంతకంతకూ పెరిగిపోవడంతో దాన్ని పరుగులెత్తించే క్రమంలో పూర్ షాట్ ఆడి ఔటయ్యారు. వారిద్దరు ఇంకాసేపు అలాగే ఆడి ఉంటే.. మ్యాచ్ మన చేతుల్లోకి ఎప్పుడో వచ్చి ఉండేది. ఇదిలా ఉండగా, చివర్లో చేయాల్సిన రన్ రేట్ కూడా పెరిగి పోవడంతో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో వికెట్లను సమర్పించుకున్నారు.
First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...