SL vs SA: శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే..

ICC Cricket World Cup 2019 | SL vs SA | దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్(15) తక్కువ పరుగులకే ఔటైనా, హషీం ఆమ్లా (80), కెప్టెన్ డూప్లెసిస్ (96) మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 10:20 PM IST
SL vs SA: శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే..
శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 10:20 PM IST
ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 203 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ ఛేదించారు. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్(15) తక్కువ పరుగులకే ఔటైనా, హషీం ఆమ్లా (80), కెప్టెన్ డూప్లెసిస్ (96) మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో మలింకకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక సఫారీ బౌలర్లను ఎదుర్కొనడానికి అష్ట కష్టాలు పడింది. ఆ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ 30 పరుగులకు మించి చేయలేదంటే ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. సఫారీ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రబాడా 2, క్రిస్ మోరిస్ 3, ప్రిటోరియస్ 3 వికెట్లు, జెపి డుమిని, ఫెలుక్వాయో చెరో వికెట్ తీశారు. ప్రిటోరియస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

కాగా, శ్రీలంక బ్యాటింగ్ చేపట్టినపుడు తేనెటీగలు కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాయి. తేనెటీగల గుంపు ఒక్కసారిగా మైదానంలోకి రావడంతో క్రీజులో వున్న లంక బ్యాట్ మెన్స్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో పాటు అంపైర్లిద్దరూ తేనెటీగల నుండి తప్పించుకోడానికి మైదానంలోనే పడుకున్నారు.

క్రికెట్ వరల్డ్ కప్ ట్విట్టర్ ఫోటో


Loading...
First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...