Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా

Jio Cricket Play Along | మే 30న ప్రారంభమైన ఈ కాంటెస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ముగిసే వరకు కొనసాగుతుంది. జియో యూజర్లు మాత్రమే కాదు... నాన్ జియో యూజర్లు కూడా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు.

news18-telugu
Updated: June 10, 2019, 11:29 AM IST
Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా
Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా (image: Reliance Jio)
news18-telugu
Updated: June 10, 2019, 11:29 AM IST
ఐపీఎల్ సీజన్‌లో సూపర్ హిట్ అయిన రిలయెన్స్ జియో 'ఖేలో క్రికెట్ జియో క్రికెట్' కాంటెస్ట్ ఇప్పుడు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా మళ్లీ వచ్చేసింది. ఈ కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరే 11 మంది మెంబర్స్‌తో టీమ్ క్రియేట్ చేయొచ్చు. కెప్టెన్, వైస్ కెప్టెన్‌లను సెలెక్ట్ చేయాలి. ఒక వికెట్ కీపర్, 3 బ్యాట్స్‌మెన్, 4 బౌలర్స్, 3 ఆల్‌రౌండర్స్ తప్పనిసరి. మీరు సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ బాగా ఆడితే మీకు పాయింట్స్ పెరుగుతాయి. నెక్స్ట్‌ 5 ఓవర్లలో మ్యాచ్‌లో ఏం జరుగుతుందో నాలుగు ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పిన జవాబులు సరైనవే అయితే పాయింట్స్ వస్తాయి. అంతేకాదు... క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పాయింట్స్ పెంచుకోవచ్చు. లీడర్‌బోర్డులో పైకి దూసుకెళ్లొచ్చు.




మే 30న ప్రారంభమైన ఈ కాంటెస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ముగిసే వరకు కొనసాగుతుంది. జియో యూజర్లు మాత్రమే కాదు... నాన్ జియో యూజర్లు కూడా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. ఇందుకోసం MyJio App యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌‌లో పాల్గొనడంతో పాటు క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా వార్తలు, స్కోర్స్, టోర్నమెంట్ షెడ్యూల్... ఇలా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నమెంట్‌కు సంబంధించిన వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. 'ఖేలో క్రికెట్ జియో క్రికెట్' కాంటెస్ట్‌ నియమ నిబంధనలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

ICC World Cup: ఊబెర్‌ బుకింగ్స్‌తో వరల్డ్ కప్‌కు వెళ్లే ఛాన్స్... కాంటెస్ట్ వివరాలివే

Zomato Cricket Cup: క్రికెట్ మ్యాచ్‌ ఫలితాన్ని కరెక్ట్‌గా చెప్తే 100% క్యాష్‌బ్యాక్

World Cup Offer: ఏడాదంతా ప్యారడైజ్ బిర్యానీ ఫ్రీ... కండీషన్స్ అప్లై
First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...