India vs New Zealand: ఇండియాకు రెయిన్ షాక్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు

ICC Cricket World Cup 2019 | India vs New Zealand: మళ్లీ కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్లీ కురిసింది. ఇలా గ్రౌండ్ సిబ్బంది 7-8 సార్లు కవర్లు తీస్తూ, మళ్లీ కప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. చివరికి భారీగా వర్షం కురిసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 13, 2019, 7:39 PM IST
India vs New Zealand: ఇండియాకు రెయిన్ షాక్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు
మ్యాచ్ వర్షార్పణం (ట్విట్టర్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 13, 2019, 7:39 PM IST
మరో మ్యాచ్ వర్షార్పణం.. ఇప్పటికే మూడు మ్యాచ్‌లను మింగేసిన వరుణుడు ఈ రోజు జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను కూడా మింగేశాడు. దీంతో నాలుగు మ్యాచ్‌లను గెలిచి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండటంతో మైదానం మొత్తం నీటితో నిండి, చిత్తడిగా మారింది. దీంతో ఇరు జట్లకు ప్రాక్టీస్ సెషన్ కూడా జరగలేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడకపోయినా, కవర్లు తీస్తుండగా ప్రారంభమైంది. మళ్లీ కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్లీ కురిసింది. ఇలా గ్రౌండ్ సిబ్బంది 7-8 సార్లు కవర్లు తీస్తూ, మళ్లీ కప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. చివరికి భారీగా వర్షం కురిసింది. దీంతో ఆటను నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ఇండియా రెండు మ్యాచ్ లాడి, రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది. నేటి మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది.





First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...