IND vs NZ: నిలకడగా ఆడుతున్న ధోని, జడేజా.. 54 బంతుల్లో 81 పరుగులు..

icc cricket world cup 2019 | ind vs nz | ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 6:41 PM IST
IND vs NZ: నిలకడగా ఆడుతున్న ధోని, జడేజా.. 54 బంతుల్లో 81 పరుగులు..
మహేంద్ర సింగ్ ధోని (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
లక్ష్య ఛేదనలో టీమిండియా ఎదురీదుతోంది. ఆదిలోనే టాపార్డర్ కుప్పకూలడంతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అభిమానులకు కాస్త కలిగించారు. ఇద్దరూ అడపాదడపా సింగిల్స్ తీస్తూ వికెట్‌ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే, సాంట్నర్ వీరిద్దరి సహనాన్ని పరీక్షించి బుట్టలో వేసుకున్నాడు. పంత్, పాండ్యా ఇద్దరూ చెరో 32 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. 36 ఓవర్లకు స్కోరు 123/6గా ఉంది. చేయాల్సిన రన్ రేట్ 8.3 గా ఉంది. ఈ స్థితిలో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన ధోనీనే మరో సారి గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. లాస్ట్ హోప్ ధోని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ధోని, జడేజా భాగస్వామ్యం హాఫ్ సెంచరీ దాటింది. ఇంకా 54 బంతుల్లో 81 పరుగులు చేయాలి. కాగా, ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ తలో రన్ చేయగా, దినేశ్ కార్తిక్ 6 పరుగులే చేసి తీవ్ర నిరాశకు గురి చేశారు.

అంతకుముందు.. 8 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ జట్టు 239 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో కేన్ విలియమ్‌సన్ 67, రాస్ టేలర్ 74 పరుగులు చేశారు. భువనేశ్వర్ 3 వికెట్లు దక్కించుకోగా, బుమ్రా, పాండ్యా, జడేజా, చాహల్‌ తలో వికెట్ పడగొట్టారు.






First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>