పేకమేడలా కుప్పకూలిన టీమిండియా టాపార్డర్.. 1,1,1,6...

icc cricket world cup 2019 | ind vs nz | 1.... 1.... 1.... ఇదీ టీమిండియా టాపార్డర్ స్కోరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశ పరిచారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 4:52 PM IST
పేకమేడలా కుప్పకూలిన టీమిండియా టాపార్డర్.. 1,1,1,6...
న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్
  • Share this:
1.... 1.... 1.... ఇదీ టీమిండియా టాపార్డర్ స్కోరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశ పరిచారు. న్యూజిలాండ్ బౌలర్ల అద్భుత స్వింగ్‌ను ఎదుర్కొనలేక ఔటయ్యారు. టీమిండియా కేవలం 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తిక్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 6 పరుగులే చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ (19), హార్దిక్ పాండ్యా (9) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 14 ఓవర్లకు టీమిండియా స్కోరు 42/4. ఈ మ్యాచ్‌లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన బ్యాటును ఝులిపించి విమర్శకుల నోళ్లు మూయించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అటు, న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. మ్యాట్ హెన్రీ 6 ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి, ఒక ఓవర్‌ మెయిడెన్ వేశాడు. బౌల్ట్ కూడా ఒక వికెట్ తీసుకొని రెండు మెయిడెన్ ఓవర్లు వేశాడు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>