IND vs NZ: వాయిదా పడ్డ సెమీ ఫైనల్.. నేడూ కొనసాగనున్న న్యూజిలాండ్ బ్యాటింగ్

ICC Cricket World Cup 2019 | IND vs NZ | వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రిజర్వు డేకు వాయిదా వేశారు. అంటే.. నేడు మ్యాచ్ కొనసాగనుంది. మిగతా 23 బంతులను న్యూజిలాండ్ ఎదుర్కొని నిర్దేశిత లక్ష్యాన్ని భారత్‌కు విధిస్తుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 12:08 AM IST
IND vs NZ: వాయిదా పడ్డ సెమీ ఫైనల్.. నేడూ కొనసాగనున్న న్యూజిలాండ్ బ్యాటింగ్
వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్ (ట్విట్టర్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 12:08 AM IST
ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారానికి వాయిదా పడింది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆ సమయంలోనే వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను నిలిపేసిన అంపైర్లు.. వర్షం తగ్గుతుందని చాలా సేపు వేచి చూశారు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు ప్రయత్నించారు. కానీ, వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రిజర్వు డేకు వాయిదా వేశారు. అంటే.. ఈ రోజు మ్యాచ్ కొనసాగనుంది. మిగతా 23 బంతులను న్యూజిలాండ్ ఎదుర్కొని నిర్దేశిత లక్ష్యాన్ని భారత్‌కు విధిస్తుంది.

కాగా, కివీస్ బ్యాట్స్‌మెన్‌లో మార్టిన్ గప్టిల్(1), హెన్రీ నికోలస్ (28), కేన్ విలియమ్‌సన్ (67), జేమ్స్ నిషామ్ (12), గ్రాండ్ హోమ్ (16) పరుగులు చేయగా, రాస్ టేలర్ (67*), టామ్ లాథమ్ (3*) క్రీజులో ఉన్నారు. ఇండియా బౌలర్లలో భువీ, బుమ్రా, హార్దిక్, జడేజా, చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.






First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...