జడేజా, ధోని పోరాటం వృథా.. సెమీస్‌లో టీమిండియా పరాజయం..

ICC Cricket World Cup 2019 | IND vs NZ | జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా , ధోని చేసిన పోరాటం వృథా అయ్యింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీ పోరులో 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 7:54 PM IST
జడేజా, ధోని పోరాటం వృథా.. సెమీస్‌లో టీమిండియా పరాజయం..
ఫైనల్లోకి న్యూజిలాండ్
  • Share this:
మూడోసారి వరల్డ్ కప్ సాధించాలన్న భారత్ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్కంఠ సెమీ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. టాపార్డర్ కుప్పకూలగా, జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా, ధోని చేసిన పోరాటం వృథా అయ్యింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీ పోరులో 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. దీంతో భారత సగటు అభిమాని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇక, భారత్ విషయానికి వస్తే.. ఆదిలోనే టాపార్డర్ కుప్పకూలింది.. క్రీజులోకి వచ్చిన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వచ్చిన దారే పట్టారు.. 5 పరుగులకే 3 వికెట్లు ఫట్.. మరో 19 రన్స్‌కే మరో వికెట్ పడింది. వారి స్కోరు 1,1,1,6.. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) వికెట్ పడకుండా కాసేపు ఆపారు. ఇద్దరూ అడపాదడపా సింగిల్స్ తీస్తూ వికెట్‌ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే, సాంట్నర్ వీరిద్దరి సహనాన్ని పరీక్షించి బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు. వీరిద్దరు సింగిల్స్‌కే పరిమితం అవుతూ వచ్చారు. ఈ దశలో రన్ రేట్ 9కి చేరింది.





అప్పుడే జడ్డూ గేర్ మార్చాడు. సిక్సుల మీదు సిక్సులు కొడుతూ న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ధోని సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే జడేజా కివీస్ బౌలర్ల భరతం పట్టాడు. అయితే చివర్లో 77 పరుగులు చేసి జడేజా ఔటయ్యాడు. ధోని(50) కూడా రెండో సింగిల్‌కు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మరో 3 బంతులు మిగిలి ఉండగానే 221 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయ్యింది. కాగా, ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ తలో రన్ చేయగా, దినేశ్ కార్తిక్ 6 పరుగులే చేసి తీవ్ర నిరాశకు గురి చేశారు.



అంతకుముందు.. 8 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ జట్టు 239 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో కేన్ విలియమ్‌సన్ 67, రాస్ టేలర్ 74 పరుగులు చేశారు. భువనేశ్వర్ 3 వికెట్లు దక్కించుకోగా, బుమ్రా, పాండ్యా, జడేజా, చాహల్‌ తలో వికెట్ పడగొట్టారు.








First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు