IND vs NZ: 46.1 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 211/5.. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..

icc cricket world cup 2019 | ind vs nz | కివీస్ బ్యాట్స్‌మెన్‌లో మార్టిన్ గప్టిల్(1) రెండో ఓవర్‌లోనే అవుట్ అయినా, కెప్టెన్ విలిమన్సన్ (67), రాస్ టేలర్ (67*) రాణించారు. అయితే, భువనేశ్వర్ 47వ ఓవర్ వేస్తున్న తరుణంలో వాన అడ్డుపడింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 9, 2019, 6:49 PM IST
IND vs NZ: 46.1 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 211/5.. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..
రాస్ టేలర్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 9, 2019, 6:49 PM IST
ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్‌లో మార్టిన్ గప్టిల్(1) రెండో ఓవర్‌లోనే అవుట్ అయినా, కెప్టెన్ విలియమ్‌సన్ (67), రాస్ టేలర్ (67*) రాణించారు. అయితే, భువనేశ్వర్ 47వ ఓవర్ వేస్తున్న తరుణంలో వాన అడ్డుపడింది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి వర్షం భారీగా పడకున్నా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయకుండా, మ్యాచ్ 46 ఓవర్లకే మ్యాచ్ పరిమితమైతే.. భారత్ టార్గెట్ 237. అదే, 20 ఓవర్ల మ్యాచ్ జరిగితే 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించాల్సి రావొచ్చు.

కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలోని భారత్‌.. నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే.





First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...