IND vs NZ: గెలిపించలేకపోయానే... రనౌట్ అయ్యాక భోరున ఏడ్చేసిన ధోని

#HeartBreaking ట్యాగ్‌తో ధోని ఏడ్చిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ.. ధోనికి సెల్యూట్ కొడుతున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 9:57 PM IST
IND vs NZ: గెలిపించలేకపోయానే... రనౌట్ అయ్యాక భోరున ఏడ్చేసిన ధోని
రనౌట్‌గా వెనుదిరుగుతున్న ధోని (ట్విట్టర్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 9:57 PM IST
అప్పటికే పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 22.5 ఓవర్లకు భారత్ స్కోరు 71/5.. అప్పటి వరకు బాగానే ఆడిన పంత్ హిట్టింగ్‌కు వెళ్లి ఔటయ్యాడు. అప్పుడే ధోని క్రీజులోకి అడుగుపెట్టాడు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింగిల్స్ తీశాడు.. అవతలి ఎండ్‌లో ఉన్న హార్దిక్ స్వేచ్ఛగా బ్యాటును ఝులింపిచాలనుకున్నాడు.. కానీ, అతడు కూడా వెనుదిరిగాడు. జడేజా క్రీజులోకి రావడంతో అతడితో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.. ఓవైపు జడేజా హిట్టింగ్ చేస్తుంటే స్ట్రైక్ రొటేట్ చేశాడు. 13 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో జడేజా క్యాచ్ ఔటయ్యాడు.. దీంతో గెలుపు బాధ్యత ధోనిపై పడింది. ఇక లాభం లేదనుకొని 49వ ఓవర్ తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. కానీ.. విధి వక్రీకరించింది.. ఆ ఓవర్‌లో మూడో బంతికి రెండో పరుగుకు ప్రయత్నించి గప్టిల్ డైరెక్ట్ త్రోకు రనౌట్ అయ్యాడు..

అంతే... స్టేడియం మొత్తం నిశ్శబ్దం.. రనౌట్ అంటూ థర్ట్ అంపైర్ ప్రకటన.. ఒక్కసారిగా ధోని భావోద్వేగానికి గురయ్యాడు. జట్టు కష్ట సమయాల్లోనూ ఎంతో నిబ్బరంగా, ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించకుండా కూల్‌గా ఉండే మహేంద్రుడు ఒక్కసారికి కంట తడి పెట్టాడు. భావోద్వేగాలకు ఆపుకోలేక క్రీజును వీడుతూనే ఏడ్చేశాడు.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయానే.. అనుకుంటూ భారంగానే పెవిలియన్ వైపు అడుగులు వేశాడు.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.



ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో టీమిండియా సెమీస్ ఓడిపోవడం యావత్ భారత క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. #HeartBreaking ట్యాగ్‌తో ఆ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ.. ధోనికి సెల్యూట్ కొడుతున్నారు.



First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...