IND vs NZ: ఈ రోజు మ్యాచ్ జరగకపోతే.. నేరుగా ఫైనల్‌కు ఇండియా?

ICC Cricket World Cup 2019 | IND vs NZ | రేపు మ్యాచ్ జరిగేందుకు అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఈ రోజు కంటే రేపు వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో, మ్యాచ్ రద్దై పోతుందని భావిస్తున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 9, 2019, 10:03 PM IST
IND vs NZ: ఈ రోజు మ్యాచ్ జరగకపోతే.. నేరుగా ఫైనల్‌కు ఇండియా?
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 9, 2019, 10:03 PM IST
ప్రపంచకప్‌లో ఇప్పటికే పలు లీగ్ మ్యాచ్‌లను మింగేసిన వరణుడు.. తొలి సెమీఫైనల్‌పైనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌పై ఏ మాత్రం కనికరం చూపడం లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. రాస్ టేలర్(67*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. అయితే, భువనేశ్వర్ 47వ ఓవర్ వేస్తుండగా వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే, ఇప్పటి వరకు వర్షం తగ్గలేదు. ఒకవేళ తగ్గితే 20 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించాల్సి వస్తుంది. మొత్తానికే ఈ రోజు వర్షం తగ్గకపోతే రిజర్వు డే ప్రకారం రేపు మ్యాచ్ జరగనుంది.

అయితే, రేపు మ్యాచ్ జరిగేందుకు అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఈ రోజు కంటే రేపు వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో, మ్యాచ్ రద్దై పోతుందని భావిస్తున్నారు. మ్యాచ్ గనక రద్దైతే, లీగ్ దశలో తొలి స్థానంలో ఉన్న భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌ను ముద్దాడని న్యూజిలాండ్‌కు ఇది మింగుడు పడని వార్త.

ఇప్పటి వరకు పలు సెమీ ఫైనల్స్‌లో ఆడిన న్యూజిలాండ్.. గత ఏడాది ఫైనల్ వరకు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఖంగు తిన్నది. దాంతో ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తూ వచ్చిన వరల్డ్ కప్ కివీస్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు కూడా వర్షం కారణంగా కివీస్ ఆశలు ఆవిరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.





First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...