ICC Cricket World Cup 2019: ఏయే దేశాలు ఏ స్థానంలో ఉన్నాయంటే..

ICC Cricket World Cup 2019: ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 7 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడగా 7 పాయింట్లు సాధించింది. అయితే రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ తర్వాత స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: June 17, 2019, 8:49 AM IST
ICC Cricket World Cup 2019: ఏయే దేశాలు ఏ స్థానంలో ఉన్నాయంటే..
వరల్డ్ కప్(image: Reuters)
  • Share this:
క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. హోరాహోరీగా సాగుతాయనుకున్న మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఎంజాయ్ చేద్దామనుకున్న మ్యాచ్‌లు వర్షం దెబ్బకు క్యాన్సిల్ అయిపోతున్నాయి. దీంతో అభిమానులకు ప్రపంచకప్ టోర్నీ అంటేనే ఇష్టం పోయే పరిస్థితి వచ్చింది. మ్యాచ్ చూద్దాం రా.. రా.. అని స్నేహితుడిని పిలిస్తే.. ఎలాగు వర్షం పడుతుంది. ఎందుకులే ఆ మ్యాచ్ చూడటం అనే రిప్లై ఇచ్చే స్థాయికి చేరింది అభిమానుల అసహనం. అంతేనా.. ఇది వరల్డ్ కప్ కాదు వాన వాన వల్లప్ప కప్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక, మ్యాచ్‌ల ఫలితాల విషయానికి వస్తే.. సాధారణ మ్యాచ్‌లలో వీరవిహారం చేసే సఫారీలు వరల్డ్ కప్ వచ్చేసరికి డీలా పడిపోతారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా వరల్డ్ కప్‌లో తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. ఆ జట్టు ఆడిన మ్యాచ్‌లలో ఒకటి గెలుపొందగా, మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. పాకిస్థాన్ పరిస్థితి కూడా ఇంతే.

అసలు ఏ జట్టు ఏ స్థానంలో ఉందని పరిశీలిస్తే.. ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 7 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడగా 7 పాయింట్లు సాధించింది. అయితే రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ తర్వాత స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ నాలుగో స్థానంలో, శ్రీలంక ఐదవ, వెస్టిండీస్ ఆరవ, దక్షిణాఫ్రికా ఏడవ, బంగ్లాదేశ్ ఎనిమిదవ, పాకిస్తాన్ తొమ్మిదవ, ఆఫ్ఘనిస్తాన్ పదవ స్థానంలో కొనసాగుతున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ట్విట్టర్ ఫోటో
Published by: Shravan Kumar Bommakanti
First published: June 17, 2019, 8:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading