World Cup Final | రెండు సార్లు టై అయితే, ఇంగ్లండ్ ఎలా గెలిచింది?

World Cup Finals | వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ జరగని ఘటన ఈ వరల్డ్ కప్‌లో చోటు చేసుకుంది.

news18-telugu
Updated: July 15, 2019, 1:12 AM IST
World Cup Final | రెండు సార్లు టై అయితే, ఇంగ్లండ్ ఎలా గెలిచింది?
ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్
news18-telugu
Updated: July 15, 2019, 1:12 AM IST
ఐసీసీ క్రికెట్ వరల్ కప్ చరిత్రలో ఇదో కొత్త చరిత్ర. గతంలో ఎప్పుడూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లు టై అవ్వలేదు. ఏదో ఒక జట్టు గెలిచింది. అయితే, లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో ఓ అద్భుత ఘటన జరిగింది. వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ జరిగి ఉండని ఘటన అది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ప్రపంచకప్ విజేత అంటూ నిర్వాహకులు ప్రకటించారు.

వరల్డ్ కప్ మ్యాచ్ చూసిన కోట్లాది మంది ప్రేక్షకులకు ఈ విషయం అస్సలు అర్థం కాలేదు. రెండు సార్లు రెండు జట్లు ఒకే స్కోర్ చేస్తే.. మ్యాచ్ టై అవ్వాలి కదా.. ఇద్దరినీ విజేతగా ప్రకటించాలి కదా అనే డౌట్లు వచ్చాయి. అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుని విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ జట్టు రెండు బౌండరీలు కొట్టింది. కానీ, న్యూజిలాండ్ కేవలం ఒక సిక్స్ మాత్రమే కొట్టింది. ఆ లెక్కన ఇంగ్లండ్ గెలిచినట్టు ప్రకటించారన్నమాట.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...