ICC Cricket World Cup 2019 | వరల్డ్ కప్ ఫైనల్.. కిక్కెక్కించిన చివరి ఓవర్..

World Cup Super Over | ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో సూపర్ ఓవర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం సాధించింది.

news18-telugu
Updated: July 15, 2019, 1:14 AM IST
ICC Cricket World Cup 2019 | వరల్డ్ కప్ ఫైనల్.. కిక్కెక్కించిన చివరి ఓవర్..
England vs New Zealand (Twitter)
  • Share this:
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో వీక్షకులకు నిజంగా కిక్ ఇచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఎలా ఉండాలో నిజంగా అలాగే అనిపించింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌కు 15 పరుగులు అవసరం అయ్యాయి. న్యూజిలాండ్ బౌలర్ బోల్ట్ రంగంలోకి దిగారు.

మొదటి బాల్ - 0
రెండో బాల్ - 0

మూడో బాల్‌ - 6 (బెన్ స్టోక్స్ )
నాలుగో బాల్ - 6 (వాస్తవంగా ఇది డైరెక్ట్ సిక్స్ కాదు. స్టోక్స్ బంతిని కొట్టిన తర్వాత రెండు పరుగులు చేశాడు. అయితే, బాల్‌ను త్రో వేసే క్రమంలో రన్నింగ్ చేస్తున్న బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కు బంతి తగిలి బౌండరీకి వెళ్లింది.)


ఐదో బాల్ - 2
ఆరో బాల్ - 1 (రెండో పరుగు కోసం ప్రయత్నించి ఉడ్స్ ఔట్ అయ్యాడు.)దీంతో ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మ్యాచ్ టై గా ముగిసింది. అయితే, సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ 15 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కూడా 15 పరుగులు చేసింది. కానీ, ఐసీీసీ నిబంధనల ప్రకారం అత్యధిక ఫోర్లు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.
First published: July 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>