ICC Cricket World Cup 2019 | వర్కవుట్ అయిన సెంటిమెంట్.. ప్రపంచ విజేత ఇంగ్లండ్

World Cup Champions | 2011లో భారత్, 2015లో ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇంగ్లండ్.. వరుసగా మూడోసారి ఆతిథ్య జట్లు వరల్డ్ కప్‌ను గెలుచుకున్నాయి.

news18-telugu
Updated: July 15, 2019, 1:13 AM IST
ICC Cricket World Cup 2019 | వర్కవుట్ అయిన సెంటిమెంట్.. ప్రపంచ విజేత ఇంగ్లండ్
ప్రపంచ విజేతగా ఇంగ్లండ్ (Image:Twitter)
  • Share this:
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో సెంటిమెంట్ మూడోసారి కూడా వర్కవుట్ అయింది. ఆతిథ్య దేశం గెలుస్తుందన్న సెంటిమెంట్ ఇంగ్లండ్ విషయంలో కూడా పనిచేసింది. 2011లో ప్రపంచ కప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ధోనీ సేన విజయం సాధించింది. సచిన్ టెండుల్కర్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆ తర్వాత 2015లో ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చాయి. అప్పుడు ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఐదోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈసారి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. దీంతో సెంటిమెంట్ వర్కవుట్ అయితే, బ్రిటిష్ జట్టు కొత్త చరిత్రను సృష్టిస్తుందని భావించారు. అంతా అనుకున్నట్టే ఇంగ్లండ్ కూడా ఫైనల్‌కు చేరింది. లార్డ్స్‌లో జరిగిన మ్మాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి కొత్త చరిత్రను సృష్టించింది. తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్‌ను లిఫ్ట్ చేసింది. సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.
First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading