ICC World Cup 2019: బంగ్లా భయపెట్టింది కానీ.. ఆస్ట్రేలియానే గెలిచేసింది..

ICC Cricket World Cup 2019: 382 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా బ్యాట్స్‌మెన్ ముందుంచిన ఫించ్ బృందం.. 48 పరుగుల తేడాతో గెలుపొందింది.బంగ్లా 333/8 పరుగులు చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 20, 2019, 11:41 PM IST
ICC World Cup 2019: బంగ్లా భయపెట్టింది కానీ.. ఆస్ట్రేలియానే గెలిచేసింది..
విజయానందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 20, 2019, 11:41 PM IST
బంగ్లాదేశ్ జట్టు కూన కానే కాదు.. భారీ లక్ష్యాలను కూడా సాధించగలిగేంత సత్తాను సంపాదించుకున్నదనడంతో ఏమాత్రం సందేహం లేదు. గత మ్యాచ్‌లో విండీస్ జట్టుకు షాక్ ఇవ్వగా, తాజాగా ఆస్ట్రేలియాను కూడా భయపెట్టినంత పని చేసింది. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తన జైత్రయాత్రను కొనసాగించింది. వరుసగా ఐదో మ్యాచ్‌ను కూడా తన ఖాతాలో వేసేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది. 382 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా బ్యాట్స్‌మెన్ ముందుంచిన ఫించ్ బృందం.. 48 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లా 333/8 పరుగులు చేసింది. బంగ్లా జట్టులో ముష్ఫికర్ రహీమ్(102) జట్టు గెలుపు కోసం శాయాశక్తులా కృషి చేశాడు. మహ్మదుల్లా(69) నుంచి మంచి సహకారం అందినా.. సాధించాల్సిన రన్ రేట్ అంతకంతకూ పెరిగి పోవడంతో ఛేదన కష్టతరమైంది. దీంతో రహీమ్ శతకం వృథా అయ్యింది. ఆ జట్టులో తమీమ్ ఇక్భాల్ (62), షకీబ్ (41) రాణించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(166) శతకం సాధించగా, ఫించ్(53), ఖవాజా(89) రాణించారు. చివర్లో వచ్చిన మ్యాక్స్‌వెల్ కేవలం పది బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సరలతో 32 పరుగులు చేశాడు. స్టీవెన్ స్మిత్(1) నిరాశ పరిచినా, స్టోయినిస్ 17, అలెక్స్ క్యారే 11 రన్స్ చేశారు.

ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..

క్రికెట్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక




First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...