Poonam Pandey: రెచ్చిపోయిన పూనమ్ పాండే.. పాక్‌ యాడ్‌కు దిమ్మదిరిగే రిప్లై

Poonam Pandey hot reply: కప్ కావాలంటే అదే కప్ ఎందుకు ఈ ‘డీ’ కప్ తీసుకోండి అంటూ తాను ధరించిన బ్రా ను తీసి, ఇందులో రెండు కప్‌లు ఉన్నాయంటూ హాట్ రిప్లై ఇచ్చింది.

news18-telugu
Updated: June 14, 2019, 1:47 PM IST
Poonam Pandey: రెచ్చిపోయిన పూనమ్ పాండే.. పాక్‌ యాడ్‌కు దిమ్మదిరిగే రిప్లై
పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ ఫోటో
news18-telugu
Updated: June 14, 2019, 1:47 PM IST
ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 16 భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ మీడియా దిగజారిన పబ్లిసిటీకి తెరలేపిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ పాకిస్థాన్ టీవీ చానల్ చేసిన యాడ్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో భారతీయులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాడ్ ఫిల్మ్‌లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను హేళన చేస్తూ చూపించడమే భారతీయలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 30 సెకన్లపాటు నిడివి ఈ వీడియోను పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ రూపొందించింది.

దీనిపై తీవ్రంగా స్పందించిన హాట్ బ్యూటీ పూనమ్ పాండే పాక్ యాడ్‌కు దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చింది. యాడ్‌లో ఉన్నట్లు టీ కప్‌ను అభినందన్ పాత్రధారి చేతిలోంచి లాక్కున్నట్లు చూపించిందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కప్ కావాలంటే అదే కప్ ఎందుకు ఈ ‘డీ’ కప్ తీసుకోండి. మీకు కావాల్సింది ఇదే అంటూ తాను ధరించిన బ్రా ను తీసి, ఇందులో రెండు కప్‌లు ఉన్నాయంటూ హాట్ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎంతైనా పూనమ్ అంటే హాట్ హాటే.. శరీరాకృతే కాదు.. ఆమె మాటలు, చేతలు కూడా హాటేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






 




View this post on Instagram




 

My Answer to the Pakistani AD. #IndvsPak World Cup 2019.


A post shared by Poonam Pandey (@ipoonampandey) on




First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...