ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సీజన్ ఉపందుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మ్యాచ్‌లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి మ్యాచ్‌లు చూడనప్పుడు లైవ్ అప్‌డేట్స్ అందించడానికి చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా స్పెషల్ ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ సెర్చ్‌తో పాటు అసిస్టెంట్‌లో ఈ ఫీచర్ పనిచేస్తుంది. క్రికెట్ లైవ్ స్కోర్ అప్‌డేట్స్‌ని రియల్‌టైమ్‌లో తెలుసుకునేందుకు ఉపయోపడ్తాయి ఈ ఫీచర్లు. మీరు గూగుల్ సెర్చ్ బార్‌లో 'ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్' అని ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో టైప్ చేస్తే చాలు లేటెస్ట్ మ్యాచ్ అప్‌డేట్స్‌తో పాటు జరిగిన, జరగాల్సిన మ్యాచ్‌ల వివరాలు కూడా ఉంటాయి. లేటెస్ట్ మ్యాచ్‌లు, టోర్నమెంట్ వివరాలు తెలుసుకోవడం మాత్రమే కాదు లైవ్ క్రికెట్ స్కోర్‌ను స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పైన పిన్ చేయొచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి.
మీరు స్మార్ట్‌ఫోన్‌లో వేరే యాప్స్ ఉపయోగిస్తున్నా సరే... లైవ్ స్కోర్ కనిపిస్తూనే ఉంటుంది. మ్యాచ్ పూర్తి కాగానే లైవ్ స్కోర్ పిన్‌ని స్క్రీన్ పైనుంచి తొలగించొచ్చు. ఇక మ్యాచ్‌లు చూడలేని వారికి మ్యాచ్ హైలైట్స్‌ని చిన్నచిన్న వీడియోల రూపంలో అందిస్తుంది గూగుల్. లైవ్ కామెంట్రీని ఇంగ్లీష్, హిందీ భాషల్లో చదవొచ్చు. ఇక గూగుల్ అసిస్టెంట్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన ఏ ప్రశ్నలకైనా సమాధానాలు తెలుసుకోవచ్చు.
Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి
ఇవి కూడా చదవండి:
క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్... షావోమీ నుంచి కొత్త పవర్ బ్యాంక్
Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్
Zomato Cricket Cup: క్రికెట్ మ్యాచ్ ఫలితాన్ని కరెక్ట్‌గా చెప్తే 100% క్యాష్‌బ్యాక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.