గౌతమ్ గంభీర్ ఇంట్లో చోరీ.. కారు ఎత్తుకెళ్లిన దొంగలు

రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్న గంభీర్ ఇంటి ముందు బుధవారం మధ్యాహ్నం ఆయన తండ్రి ఫర్చూనర్ కారును పార్క్ చేశారు. ఆ కారును గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.

news18-telugu
Updated: May 29, 2020, 4:39 PM IST
గౌతమ్ గంభీర్ ఇంట్లో చోరీ.. కారు ఎత్తుకెళ్లిన దొంగలు
గౌతం గంభీర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
టీమిండియా మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ నివాసంలో చోరీ జరిగింది. ఇంటి ముందు నిలిపి ఉన్న గౌతమ్ గంభీర్ తండ్రి కారును దుండగులు ఎత్తుకెళ్లారు. కారును తీసుకెళ్తున్న దృశ్యాలో సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్న గంభీర్ ఇంటి ముందు బుధవారం మధ్యాహ్నం ఆయన తండ్రి ఫర్చూనర్ కారును పార్క్ చేశారు. ఆ కారును గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఘటనపై గౌతమ్ గంభీర్ తండ్రి దీపక్ గంభీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

'ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్లో కారు చోరీ జరిగిందని మాకు సమాచారం అందింది. మా టీమ్‌తో ఎంపీ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి దీపక్ గంభీర్‌తో మాట్లాడాం. తెలుపు రంగు టయోటా ఫర్చూనర్ కారును తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.' అని సెంట్రల్ ఢిల్లీ డీసీపీ సంజయ్ భాటియా తెలిపారు.
First published: May 29, 2020, 4:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading