Home /News /sports /

CRICKET FANS AT CUTTACK GETS WATER BY POLICE AT BARABATI STADIUM VIDEO GOES VIRAL SJN

IND vs SA : క్రికెట్ కోసం దాహంతో చావడానికైనా సిద్ధమే.. పాపం చివరికి ఆ పోలీస్ తీర్థంలా నీళ్లను..

క్రికెట్ ఫ్యాన్స్ తో పోలీస్ (PC : TWITTER)

క్రికెట్ ఫ్యాన్స్ తో పోలీస్ (PC : TWITTER)

IND vs SA : ఇండియాలో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. రోజు ఒక అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించినా.. పనులు మానుకుని మరీ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ఎగబడిపోతారు ఇక్కడి జనం. ఇక కరోనా వల్ల 2020 నుంచి ఇండియాలో మ్యాచ్ లు పెద్దగా జరగడం లేదు.

IND vs SA : ఇండియాలో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. రోజు ఒక అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించినా.. పనులు మానుకుని మరీ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ఎగబడిపోతారు ఇక్కడి జనం. ఇక కరోనా వల్ల 2020 నుంచి ఇండియాలో మ్యాచ్ లు పెద్దగా జరగడం లేదు. 2020లో మార్చి తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ జరగకపోగా.. కాసుల లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యూఏఈకి తరలిపోయింది. ఇక 2021లో ఇంగ్లండ్ (England) తో సిరీస్ ఆడి.. ఐపీఎల్ తొలి అంచె మాత్రమే జరిగాయి. అయితే వీటిని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. ఇక కరోనా కల్లోలం తగ్గడంతో దేశంలో మళ్లీ క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఈ ఏడాది ఇప్పటికే దేశంలో వెస్టిండీస్, శ్రీలంక లతో టీమిండియా (Team India) సిరీస్ లు ఆడేసింది. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి మెగా టోర్నీ కూడా విజయవంతంగా పూర్తయింది. అయినప్పటికీ ఇక్కడి క్రికెట్ ఫ్యాన్స్ కు ఆటపై కొద్దిగా కూడా బోర్ అనేది రాలేదు. అందుకే ఐపీఎల్ ముగిసిన వెంటనే మొదలైన ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య టి20 సిరీస్ ను చూసేందుకు రెడీ అయిపోయారు.

ఇది కూడా చదవండి : క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం ఆడవాళ్ల బాహాబాహీ.. ఈ వీడియో చూస్తే మీ మతి పోవాల్సిందే

ఇక ఈ ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగింది. ఇక రెండో టి20 ఒడిశాలోని కటక్ బారాబతి స్టేడియంలో ఈ నెల 12న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్ సేల్స్ ను ఆన్ లైన్ లో ఆరంభించగా అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక ప్రస్తుతం ఆఫ్ లైన్ లో టికెట్లను విక్రయిస్తున్నారు. ఇక వీటి కోసం బారాబతి స్టేడియం ముందు చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. టికెట్ల కోసం మహిళలు బాహాబాహీకీ దిగుతుంటే.. పురుషులు మాత్రం తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా టికెట్ల కోసం గంటలకు గంటలు పడిగాపులు కాస్తున్నారు.



టికెట్లను ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో తిండితిప్పలు మానేసి మరీ క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. ఇక్కడే ఉంటే చస్తారు అని పోలీసులు అంటున్నా వినిపించుకోకుండా ఈ క్రికెట్ వీరాభిమానులు చావడానికి కూడా సిద్ధమే అన్నట్లు క్యూ లైన్లలో ఉంటున్నారు. చివరికి ఒక పోలీస్ ఒక బాటిల్ నిండా నీటిని తీసుకుని ఈ వీరాభిమానుల గొంతులను తడుపుతున్నాడు.


గుళ్లో పూజారి ఏ విధంగా తీర్థాన్ని భక్తులకు ఇస్తాడో అదే విధంగా ఈ క్రికెట్ భక్తులకు కూడా మంచి నీటిని అదే విధంగా అందించాడు ఈ పోలీస్ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, IPL, IPL 2022, KL Rahul, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు