England vs New Zealand | సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో...ఎట్టకేలకు ఇంగ్లాండ్ బోణీ...విశ్వవిజేతగా ఇంగ్లీష్ సేన...

England vs New Zealand Live Score, ICC World Cup 2019 Final at Lords: టోర్నీ ఆసాంతం అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొట్టిన మోర్గాన్ సేన ఫైనల్ లో కివీస్ జట్టును మట్టికరిపించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ టై కావడంతో, సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ గెలిచి ఇంగ్లాండ్ విశ్వవిజేత అయ్యింది.

news18-telugu
Updated: July 15, 2019, 3:41 PM IST
England vs New Zealand | సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో...ఎట్టకేలకు ఇంగ్లాండ్ బోణీ...విశ్వవిజేతగా ఇంగ్లీష్ సేన...
విశ్వవిజేత ఇంగ్లాండ్
  • Share this:
క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లాండ్ ఇంతకాలం వరల్డ్ కప్ గెలుచుకోలేకపోవడం అనేది ఒక వెలితి అనే చెప్పవచ్చు. 1975 నుంచి మొదలు 2015 వరల్డ్ కప్ వరకూ 3 సార్లు టోర్నీ ఫైనల్ కు చేరుకొని విశ్వవిజేత అయ్యే అవకాశం జారవిడుచుకున్నప్పటికీ, 2019లో మాత్రం స్వదేశంలో క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఇంగ్లీష్ సేన ప్రపంచ కప్ ను అందుకుంది. టోర్నీ ఆసాంతం అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొట్టిన మోర్గాన్ సేన ఫైనల్ లో కివీస్ జట్టును మట్టికరిపించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదనలో ఇంగ్లాండ్ 241 పరుగులకు ఆలౌటవ్వడంతో నాటకీయ పరిణామాల మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ లో తొలి ఛాన్స్ ఇంగ్లాండ్ కు దక్కగా ఆ ఓవర్లో మొత్తం 15 పరుగులు రాబట్టింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేసింది. అయితే మొత్తం ఇన్నింగ్స్ లో ఇరు జట్లు బాదిన బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ కన్నా ఎక్కువ బౌండరీలు సాధించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ విశ్వవిజేత అయ్యింది.

Image : Twitter


ఇదిలా ఉంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పరుగుల సాధనలో తడబడింది. వరుసగా వికెట్లు పడటంతో పాటు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కివీస్ బ్యాట్స్ మెన్ ఫెయిలయ్యారనే చెప్పవచ్చు. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 241/8 స్కోరు సాధించడం విశేషం. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్ నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ 6వ ఓవర్లో గుప్తిల్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 30 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన హెన్రీ నికోలస్ (55) వేగంగా పరుగులు చేసే క్రమంలో ఔటయ్యాడు. అనంతరం రాస్ టైలర్ సైతం (15) స్వల్ప పరుగులకే ఔటయ్యాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ స్కోరు 200 దాటింది.
Published by: Krishna Adithya
First published: July 15, 2019, 12:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading