ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 85 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. వరల్డ్ ఛాంపియన్‌కు గర్వ భంగం..

ENG vs IRE Test Match : లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌ ఈ రోజు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో అతి తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 24, 2019, 7:52 PM IST
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 85 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. వరల్డ్ ఛాంపియన్‌కు గర్వ భంగం..
85 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
  • Share this:
క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది.. వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి తొలిసారి కప్‌ను ముద్దాడిన ఆంగ్లేయ జట్టుకు గర్వ భంగం జరిగింది.. మొన్న జరిగిన వరల్డ్ కప్‌లో మేటి జట్లను సైతం ఓడించిన ఆ జట్టు ఓ అనామక జట్టు చేతిలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌ ఈ రోజు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో అతి తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది. టీమ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం విశేషం. బెయిర్‌స్ట్రో, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు. ముగ్గురు మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జో డెన్లీ(23)దే అత్యధిక స్కోరు కావటం గమనార్హం.

ఐర్లాండ్ బౌలర్లలో టిమ్ ముర్టాగ్ 5 వికెట్లు తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం తొమ్మిది ఓవర్లు వేసిన టిమ్.. 2 ఓవర్లు మెయిడెన్ చేసి, 13 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మార్క్ అడయార్ 3 వికెట్లు, బోయిడ్ రాంకిన్ 2 వికెట్లు తీశారు. మొత్తంగా 23.4 ఓవర్లకే ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది.

First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>