Home /News /sports /

CRICKET ENG VS AUS OLD ENEMIES READY FOR ASHES BATTLE STARTS FROM TODAY BS

The Ashes: ఇది యుద్ధం కాదు.. ఆత్మగౌరవం.. యాషెస్ సిరీస్ ప్రారంభం..

యాషెస్ సిరీస్ (Photo: ICC/Instagram)

యాషెస్ సిరీస్ (Photo: ICC/Instagram)

The Ashes: యాషెస్ సిరీస్‌తోనే ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్ వేదికగా ఈ రోజు ప్రారంభం కాబోతోంది.

భారత్, పాక్ మ్యాచ్ కన్నా ఎక్కువ ఉద్విగ్న వాతావరణం ఉంటుందక్కడ.. చిరకాల ప్రత్యర్థులంటే తామే అన్నంతగా కోపంతో ఉంటారు.. ప్రత్యర్థి జట్టుది ఒక్క వికెట్ పడినా ప్రపంచాన్ని గెలిచినంత ఆనంద పడతారు.. మైదానంలోని ఆటగాళ్లే కాదు, మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుల్లో నరాలు బిగబట్టేంత ఉత్కంఠ, కత్తులతో దూసుకుంటున్నంత ఉద్రిక్తత కనిపిస్తుంది.. ఎన్నో మరపురాని గుర్తులకు, చేదు జ్ఞాపకాలకు వేదిక.. ది యాషెస్. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడే ఈ సిరీస్‌కు ఉన్న ఆదరణ ఏ సిరీస్‌కు లేదంటేనే అర్థం చేసుకోవచ్చు దాని ప్రత్యేకత ఏంటో..! ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ సిరీస్‌తోనే ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్ వేదికగా ఈ రోజు ప్రారంభం కాబోతోంది. రెండేళ్ల పాటు టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది.

ఇక, వన్డే ప్రపంచకప్‌‌ను దక్కించుకున్న ఉత్సాహంతో ఇంగ్లండ్.. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో క్రికెట్ యుద్ధానికి దిగుతోంది. ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ప్రత్యర్థి చేతిలో భంగపడిన ఆస్ట్రేలియా యాషెస్‌లో బదులు తీర్చుకోవాలని చూస్తోంది. అంతేకాదు 4-0తో గత యాషెస్‌ సిరీస్‌ను చేజిక్కించుకున్న కంగారూలు ఈసారీ తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటున్నారు.

కీలక ఆటగాళ్లు:

ఇంగ్లండ్: జో రూట్, బెన్ స్టోక్స్, అండర్సన్
ఆస్ట్రేలియా: స్టీవ్స్ స్మిత్, డేవిడ్ వార్నర్, కమిన్స్
First published:

Tags: Australia, Cricket, England, ICC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు