ధోని వల్లే రోహిత్ శర్మ ఈ స్థాయికి.. గంభీర్ కీలక వ్యాఖ్యలు..

కెరీర్ తొలినాళ్లతో బాగా ఇబ్బంది పడ్డాడు రోహిత్. క్రీజులో కుదురుకున్నా ఆ స్కోర్లను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. మిడిలార్డర్‌లో వచ్చినా పెద్దగా షైనింగ్ కాలేదు.

news18-telugu
Updated: May 4, 2020, 9:43 AM IST
ధోని వల్లే రోహిత్ శర్మ ఈ స్థాయికి.. గంభీర్ కీలక వ్యాఖ్యలు..
రోహిత్, ధోని
  • Share this:
రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఈ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఉన్న ఇండియాలో తన కంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు హిట్ మ్యాన్. అబ్బురపరిచే సిక్సులు, చూడచక్కని ఫోర్లు, క్లాసీ షాట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అతడి బ్యాటింగ్ సొగసే అంత అని చెప్పుకోవచ్చు. డబుల్ సెంచరీలు, సెంచరీలు.. కాదు తన జట్టు గెలుపే ముఖ్యమంటాడు ఈ ముంబైకర్. ఐపీఎల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా.. తన ఆటతీరులో ఏమాత్రం తేడా ఉండదు. ప్రశాంతంగా ఉంటూనే జట్టు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడతాడు. అయితే, కెరీర్ తొలినాళ్లతో బాగా ఇబ్బంది పడ్డాడు రోహిత్. క్రీజులో కుదురుకున్నా ఆ స్కోర్లను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. మిడిలార్డర్‌లో వచ్చినా పెద్దగా షైనింగ్ కాలేదు. కానీ.. రోహిత్ ప్రతిభ అందరికీ తెలుసు. అయితే, రోహిత్ ఇంతలా రాణించడానికి, ప్రపంచ క్రికెట్‌లో రికార్డులు సృష్టించడానికి ధోనినే కారణమని అన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. రోహిత్ కెరీర్ మొదట్లో చాలా ఇబ్బండి పడ్డాడని, అతడికి ధోని వెన్నుదన్నుగా నిలిచాడని చెప్పాడు.
ధోనీతో గంభీర్(ఫైల్ ఫోటో)

మిడిలార్డర్ నుంచి ఓపెనింగ్‌కు ప్రమోషన్, ఎక్కువ మ్యాచ్‌లలో ఆడే అవకాశం.. అంతా ధోని చలవేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వన్డేల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అని కొనియాడాడు. ‘రోహిత్ 100 పరుగులు దాటేశాడంటే.. సెంచరీ చేశాడు అని అనరు. డబుల్ సెంచరీ మిస్ చేశాడు’ అని అంటారని హిట్‌ మ్యాన్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు బాగా రాణిస్తున్నారని, ధోని లాగే వాళ్లు కూడా యువ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పాడు.
First published: May 4, 2020, 9:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading