IPL: మరోసారి ధోని చరిత్ర సృష్టించేనా... ఊరిస్తున్న వైజాగ్...

గత 11 ఐపీఎల్ సీజన్లలో 7సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫైనల్‌కు చేర్చిన మహేంద్రుడు ఈ సారి కూడా ఫైనల్‌కు చేర్చేందుకు సిద్ధమవుతున్నాడు.

news18-telugu
Updated: May 10, 2019, 7:27 AM IST
IPL: మరోసారి ధోని చరిత్ర సృష్టించేనా... ఊరిస్తున్న వైజాగ్...
మహేంద్ర సింగ్ ధోని (ఫైల్)
news18-telugu
Updated: May 10, 2019, 7:27 AM IST
మహేంద్ర సింగ్ ధోనికి అచ్చొచ్చిన వేదిక.. విశాఖపట్నం. అతడి సొంత మైదానం రాంచీ అయినా వైజాగ్ అంటే ధోనికి ప్రత్యేక అభిమానం.. ఎందుకంటే తన బ్యాటుకు పనిచెప్పడం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. అదీ పాకిస్థాన్‌పై. అందుకే, ధోని-వైజాగ్‌ది విడదీయరాని బంధం. అయితే, ఆ వేదికపై మరోసారి రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతాన్నాడీ కెప్టెన్ కూల్. గత 11 ఐపీఎల్ సీజన్లలో 7సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫైనల్‌కు చేర్చిన మహేంద్రుడు ఈ సారి కూడా ఫైనల్‌కు చేర్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, అపార అనుభవం ఉన్న ఆటగాళ్లతో కలిసి ఇప్పటిదాకా టీంను విజయతీరాలకు చేర్చిన ధోనిని జట్టు బ్యాటింగ్ వైఫల్యం వెంటాడుతోంది. వరుసగా రెండు ఓటములు కూడా ఆ జట్టును కుంగదీస్తోంది. అయితే, తన చతురతతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్‌ చేరాలని చూస్తున్నారు.

యువ రక్తంతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు సీఎస్‌కే క్వాలిఫయర్2లో తలపడుతోంది. 11 సీజన్లలో ఢిల్లీ జట్టు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ సారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ జట్టు సూపర్ డూపర్ ఆటతీరుతో ముందుకు సాగుతోంది. తొలిసారిగా నాకౌట్‌ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసుకున్న ఈ జట్టు ఇప్పుడు రెండో క్వాలిఫయర్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఎదుర్కోబోతోంది. జోష్‌లో ధోనిసేనను ఓడించి తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌ పోరులో ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. లీగ్‌ దశలో ఢిల్లీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై విజయాలు సాధించింది. అయితే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై ఉత్కంఠ విజయాన్నందుకున్న ఢిల్లీ ఫుల్‌ జోష్‌లో ఉంది.

First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...