2028 ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్.. ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఐసీసీ..

Cricket in 2028 Olympics | లాస్‌ ఏంజెలిస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీ చర్యలు తీసుకుంటోంది. మెరిల్‌ బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వరల్డ్‌ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌ మైక్‌ గ్యాటింగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 13, 2019, 6:15 PM IST
2028 ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్.. ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఐసీసీ..
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరే అవకాశం
  • Share this:
ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గతంలో కొన్నేళ్లు పాటు దీని కోసం ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. అయితే, ఇప్పుడు ఐసీసీ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. లాస్‌ ఏంజెలిస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మెరిల్‌ బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వరల్డ్‌ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌ మైక్‌ గ్యాటింగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ మధ్యే అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ(వాడా) అనుబంధ జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ(నాడా) పరిధిలోకి బీసీసీఐ రావడం కూడా ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు అవగతమవుతోంది.

అయితే, అంతకుముందు 2024లో ప్యారిస్‌లో జరిగే క్రీడల్లోనే క్రికెట్‌ను చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అది కుదరలేదు. దీంతో కనీసం 2028 క్రీడల్లోనైనా క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు