BSNL: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు

BSNL-Hotstar Premium | ఇప్పటికే ఎరోస్ నౌ, అమెజాన్ ప్రైమ్‌తో కూడా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు హాట్‌స్టార్ ప్రీమియంతో చేతులు కలిపింది.

news18-telugu
Updated: June 24, 2019, 4:59 PM IST
BSNL: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు
BSNL: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త. బీఎస్ఎన్ఎల్ ఫిక్స్‌డ్-లైన్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సూపర్‌స్టార్ 300 సబ్‌స్క్రైబ్ చేసుకున్నవాళ్లు హాట్‌స్టార్‌లో ఉచితంగా ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు చూడొచ్చు. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సూపర్‌స్టార్ 300 ధర నెలకు రూ.749. ఈ ప్లాన్‌ తీసుకున్నవారికి 50 ఎంబీపీఎస్‌తో 300 జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత 2 ఎంబీపీఎస్‌తో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఇక హాట్‌స్టార్ ప్రీమియం ఉచితంగా పొందొచ్చు. అయితే కేవలం ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు మాత్రమే యాక్సెస్ లభిస్తుంది.

ఈ రోజుల్లో క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్, డెస్క్‌టాప్స్, స్మార్ట్‌టీవీల్లో చూస్తున్నారు. కస్టమర్లు హైస్పీడ్ డేటా కోరుకుంటున్నారు. అందుకోసమే మేం హాట్‌స్టార్ ప్రీమియంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. స్పోర్ట్స్ సీజన్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు మా సూపర్ స్టార్ 300 కస్టమర్లకు బెస్ట్ ఆఫర్స్ ఇవ్వాలనుకుంటున్నాం.
అనుపమ్ శ్రీవాస్తవ, బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్


ఇప్పటికే ఎరోస్ నౌ, అమెజాన్ ప్రైమ్‌తో కూడా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు హాట్‌స్టార్ ప్రీమియంతో చేతులు కలిపింది. ఇటీవల రియలెన్స్ జియో కూడా తమ సబ్‌స్క్రైబర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితంగా అందిస్తోంది. క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రూ.251 రీఛార్జ్ చేసుకున్నవారు జియో టీవీ యాప్ ద్వారా హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూడొచ్చు. ప్రస్తుతం టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కంపెనీలు. ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కొనసాగుతుండటంతో ఈ సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి.



Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?

Loading...
ఇవి కూడా చదవండి:

Google Pay: యాప్‌లో క్రికెట్ ఆడితే రూ.3,300 వరకు స్క్రాచ్ కార్డ్స్

48 MP Smartphone: రూ.20,000 లోపు 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్లు ఇవే...

Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...