• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • CRICKET BCCI HAS WRITTEN A LETTER TO THE ICC SEEKING PERMISSION FOR MS DHONI TO CONTINUE WEARING WICKET KEEPING GLOVES WITH BALIDAAN SYMBOL BS

ధోనీని వెనకేసుకొచ్చిన బీసీసీఐ.. ఐసీసీ అభ్యర్థనకు ప్రతిగా..

ధోనీని వెనకేసుకొచ్చిన బీసీసీఐ.. ఐసీసీ అభ్యర్థనకు ప్రతిగా..

ఎంఎస్ ధోనీ

#DhoniKeepTheGlove బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ స్పందిస్తూ.. ఆ చిహ్నాన్ని తొలగించాలన్న అభ్యర్థన మాత్రమే ఐసీసీ చేసిందని, అది ఆదేశం కాదని తెలిపారు.

  • Share this:
Cricket World Cup 2019: వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన గ్లోవ్స్‌కు బలిదాన్‌ గుర్తును వినియోగించిన విషయం తెలిసిందే. దీనిపై జోరుగా చర్చ సాగింది. ధోని ఫ్యాన్స్ అంతా మిస్టర్ కూల్‌కు అండగా నిలవగా, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. పాక్ మంత్రి బలిదాన్ గుర్తు వినియోగంపై రచ్చ రచ్చ చేశారు. చివరికి ఐసీసీ కూడా అభ్యంతరం తెలిపింది. ఆ గుర్తును తొలగించేలా చర్యలు తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించింది. దీంతో ధోని నీ వెంట మేమున్నామంటూ సోషల్ మీడియా హోరెత్తించింది. #DhoniKeepTheGlove అంటూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ధోని అభిమానులు మద్దతు పలికారు. ఇప్పుడు వారికి తోడుగా బీసీసీఐ కూడా కదిలి వచ్చింది. ధోని బలిదాన్ గుర్తు వాడటంలో తప్పు లేదని ప్రకటించింది. అతడికి అండగా నిలుస్తూ ఐసీసీకి ఓ లేఖ రాసింది.

బలిదాన్ గుర్తు ఉన్న గ్లోవ్స్ ధరించేందుకు ధోనీకి అనుమతివ్వాలని విన్నవించింది. ఎలాంటి వాణిజ్య, మతపరమైన, ఆర్మీకి చెందిన చిహ్నాలు వాడలేదని బీసీసీఐ తెలిపింది. ఆర్మీ చిహ్నం కింద బలిదాన్ అని రాసి ఉంటుందని, కానీ, ధోని గ్లోవ్స్‌పై అలా రాసి లేదని, కాబట్టి అతడు నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. దీనిపై బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ స్పందిస్తూ.. ఆ చిహ్నాన్ని తొలగించాలన్న అభ్యర్థన మాత్రమే ఐసీసీ చేసిందని, అది ఆదేశం కాదని తెలిపారు. దీనిపై ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందే బీసీసీఐ అధికారులు ఐసీసీతో చర్చిస్తారని వెల్లడించారు. మరోవైపు, బీసీసీఐ రాసిన లేఖ అందిందని ఐసీసీ తెలిపింది. ఆ లేఖను పరిగణలోకి తీసుకుంటామని, చిహ్నం వినియోగంపై చర్చిస్తామని స్పష్టం చేసింది.
First published:

అగ్ర కథనాలు