విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ వివాదం.. రంగంలోకి దిగిన బీసీసీఐ..

Kohli-Rohit Rift: వీరిద్దరి మధ్య వివాదం వాస్తవమేనని, దీన్ని సద్దుమణిగేలా చేసేందుకు బీసీసీఐ రంగంలోకి దిగిందని మరో వార్త వినిపిస్తోంది.

news18-telugu
Updated: July 29, 2019, 12:52 PM IST
విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ వివాదం.. రంగంలోకి దిగిన బీసీసీఐ..
విరాట్ కోహ్లి,రోహిత్ శర్మ
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య వివాదం నడుస్తోందని గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పొసగడం లేదని వరల్డ్ కప్ నుంచి సెమీ ఫైనల్‌లోనే భారత్ ఇంటి ముఖం పట్టిన అనంతరం వార్తలొచ్చాయి. భారత్ ఇంటిముఖం పట్టడానికి ఇదీ ఓ కారణమని ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యే విరాట్ కోహ్లీని, అతని భార్య అనుష్క శర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాల్ చేయడం కూడా ఊహాగానాలను మరింత పెంచింది. అయితే, వీరిద్దరి మధ్య వివాదం వాస్తవమేనని, దీన్ని సద్దుమణిగేలా చేసేందుకు బీసీసీఐ రంగంలోకి దిగిందని మరో వార్త వినిపిస్తోంది. ఓ బీసీసీఐ సీనియర్ అధికారి వీరిద్దరితో చర్చించనున్నట్లు తాజా సమాచారం.

బీసీసీఐ సీఈవో రాహుల్ జోషి తానే స్వయంగా అమెరికా వెళ్లి కోహ్లీ, రోహిత్‌తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలో టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి భాగం అవుతారని సమాచారం. కాగా, వెస్టిండీస్‌తో రెండు టీ-20 మ్యాచ్‌లను భారత్.. అమెరికాలోని ఫ్లొరిడాలో ఆడనుంది.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు