కోహ్లీకి బిగ్ షాక్.. ఆస్ట్రేలియా చేతిలో..

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టీమిండియా విధించిన 255 పరుగుల టార్గెట్‌ను సునాయసంగా ఛేదించింది.

news18-telugu
Updated: January 14, 2020, 8:36 PM IST
కోహ్లీకి బిగ్ షాక్.. ఆస్ట్రేలియా చేతిలో..
వార్నర్
  • Share this:
ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టీమిండియా విధించిన 255 పరుగుల టార్గెట్‌ను సునాయసంగా ఛేదించింది. ఓపెన్లరు వార్నర్, ఫించ్ దెబ్బకు లక్ష్యం చిన్నదైపోయింది. వీరిద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. సిక్సులు, ఫోర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. అంతకుముందు టీమిండియా 255 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ రోహిత్ శర్మ 10 పరుగులు మాత్రమే చేసి, పెవిలియన్ బాట పట్టాడు. ధవన్(74), రాహుల్(47) రాణించారు. ఆ తర్వాత వచ్చినవాళ్లంతా ఎవ్వరూ 30 పరుగులకు మించలేదు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్ 2, రిచర్డ్ సన్ 2, జంపా, అస్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా ఓటమి చెందగా, 17న రాజ్‌కోట్‌లో జరగాల్సిన రెండో వన్డేలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు