హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS: భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా బలగం ఇదే.. నలుగురు స్పిన్నర్లతో సవాల్ విసరనున్న కమిన్స్ సేన..

IND vs AUS: భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా బలగం ఇదే.. నలుగురు స్పిన్నర్లతో సవాల్ విసరనున్న కమిన్స్ సేన..

PC : ICC

PC : ICC

IND vs AUS: భారత్‌తో తలపడనున్న టెస్టు జట్టుకు 18 మంది ప్లేయర్స్‌తో ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. కొందరు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) టేబుల్‌లో ఆస్ట్రేలియా (Australia) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన 3 టెస్ట్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో గెలిచింది. మొత్తం 75.56 పాయింట్లతో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ టేబుల్‌లో టాప్‌లో ఉంది. ఇటీవల బంగ్లాతో టెస్ట్ సిరీస్‌ గెలిచిన ఇండియా (India) 58.93 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఆశలు సజీవంగా నిలుపుకుంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి త్వరలో జరుగనున్న ఆస్ట్రేలియా- ఇండియా టెస్ట్‌ సిరీస్‌పై పడింది. సిరీస్‌లో తొలి టెస్ట్‌ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. భారత్‌తో సిరీస్‌ గెలవడానికి ఆస్ట్రేలియా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా భారత్‌లో గత నాలుగు మ్యాచ్‌లలో ఒకే ఒక టెస్ట్ గెలిచింది.

* డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణించిన మర్ఫీకి అవకాశం

భారత్‌తో తలపడనున్న టెస్టు జట్టుకు 18 మంది ప్లేయర్స్‌తో ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. కొందరు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. ఈ టీమ్‌లో విక్టోరియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్, అష్టన్ అగర్, మిచెల్ స్వెప్సన్‌ కూడా చోటు సంపాదించారు. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది ఆస్ట్రేలియా. 2019 జనవరి తర్వాత మొదటిసారి పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌కు అవకాశం దక్కింది.

అతనికి టెస్ట్‌ జట్టులోకి తిరిగి ఆహ్వానం అందింది.

మర్ఫీ 2022కి ముందు ఒకే ఒక్క ఫస్ట్-క్లాస్ గేమ్ ఆడాడు. అయితే గత 12 నెలలుగా విక్టోరియా, ఆస్ట్రేలియా A, ప్రైమ్ మినిస్టర్స్ XI తరఫున రాణించాడు. దీంతో టెస్టు జట్టు తలుపులు తెరుచుకున్నాయి. షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో 22 ఏళ్ల మార్ష్ ఇప్పటి వరకు 17.71 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లలో అత్యల్ప సగటును నమోదు చేశాడు.

* హ్యాండ్స్‌కాంబ్‌కు పిలుపు

ఆస్ట్రేలియా బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్, డొమెస్టిక్‌ సర్క్యూట్‌లో స్థిరమైన ప్రదర్శనల తర్వాత టెస్ట్‌ టీమ్‌కు సెలక్ట్‌ అయ్యాడు. షెఫీల్డ్ షీల్డ్ 2021-22 సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో 49.78 సగటుతో 697 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆడమ్ జంపా కంటే ముందుగా స్వెప్సన్‌కు ప్రాధాన్యం లభించింది. అతడు రిస్ట్-స్పిన్నర్ కాబట్టి, స్పిన్-బౌలింగ్ విభాగంలో వైవిధ్యం ఉటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అగర్‌.. ఇటీవలి టెస్టులో వికెట్లేమీ పడగొట్టలేకపోయినా సెలక్టర్లు నమ్మకం ఉంచారు.

* మోరిస్‌ అరంగేట్రం?

అడిలైడ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన పింక్-బాల్ మ్యాచ్‌కి మొదటిసారి టెస్ట్ స్క్వాడ్‌కి సెలక్ట్ అయిన అన్‌క్యాప్డ్ శీఘ్ర లాన్స్ మోరిస్‌ కూడా భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. మిచెల్ స్టార్క్ తొలి మ్యాచ్‌కు దూరం కావడంతో.. మోరిస్ అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. అతనికి సిడ్నీలో దక్షిణాఫ్రికాపై రెండు ఇన్నింగ్స్‌లలో 5-57తో ఫాంలోకి తిరిగి వచ్చిన జోష్ హేజిల్‌వుడ్ నుంచి గట్టి పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కామెరాన్ గ్రీన్ వేలికి గాయం అయింది. అతని ఫిట్‌నెస్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

* ఆస్ట్రేలియా జట్టు

పాట్ కమిన్స్(కెప్టన్‌), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.

First published:

Tags: Cricket, David Warner, India vs australia, Pat cummins, Steve smith, Team India

ఉత్తమ కథలు