యాషెస్ సిరీస్: నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం..

Ashes 2019 | స్మిత్ అద్భుత బ్యాటింగ్.. కమిన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా మరో ఘన విజయాన్ని సాధించింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో కంగారులు ఇంగ్లండ్ జట్టును మట్టి కరిపించారు. 185 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 9, 2019, 7:38 AM IST
యాషెస్ సిరీస్: నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం..
ఆస్ట్రేలియా ఆటగాళ్ల విజయోత్సాహం
  • Share this:
స్మిత్ అద్భుత బ్యాటింగ్.. కమిన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా మరో ఘన విజయాన్ని సాధించింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో కంగారులు ఇంగ్లండ్ జట్టును మట్టి కరిపించారు. 185 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. 383 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 197 పరుగులకే ఆలౌట్ అయింది. కమిన్స్ దెబ్బకు(43/4) విలవిల్లాడింది. ఓ దశలో ఇంగ్లండ్ 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. డెన్లీ (53), రాయ్ (31)లు కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. గత మ్యాచ్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చిన స్టోక్స్ (1) ఈ సారి తీవ్రంగా నిరాశపరిచాడు. బెయిర్‌స్టో (25), బట్లర్ (34) కూడా విఫలం కావడంతో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. చివర్లో ఒవర్టన్ (21), లీచ్ (12) బౌలర్లకు విసుగు తెప్పించి విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు.

మరో 15 ఓవర్లు కనుక వీరిద్దరూ క్రీజులో ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. పది బంతుల తేడాతో వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో విజయం ఆసీస్ సొంతమైంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

ఇరు జట్ల స్కోరు వివరాలివీ..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 497/8 డిక్లేర్డ్‌;


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 301;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 186/6 డిక్లేర్డ్‌;
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 197
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు