క్రికెట్ బంతిపై ఉమ్మి బదులు...మైనం వాడకంపై కుంబ్లే కమిటీ పరిశీలన...

లాలాజల నిషేధంపై బౌలర్లు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా బాల్ స్వింగ్ చేయడం కష్టతరం అవుతుందని అభిప్రాయం చెబుతున్నారు. మరికొంత మంది బౌలర్లు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరారు.

news18-telugu
Updated: May 25, 2020, 4:10 PM IST
క్రికెట్ బంతిపై ఉమ్మి బదులు...మైనం వాడకంపై కుంబ్లే కమిటీ పరిశీలన...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనావైరస్ (Coronavirus) క్రీడా ప్రపంచాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడిప్పుడే టోర్నమెంట్లు నెమ్మదిగా ప్రారంభమవుతున్నప్పటికీ, కరోనా భయం వాటి నిర్వహణపై స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో, కరోనా ప్రభావం క్రికెట్‌పై కూడా కనిపిస్తుంది. ఈ భయం కారణంగా, బాల్ షైనింగ్ కోసంపై లాలాజలం వాడటాన్ని నిషేధించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే (Anil Kumble)మాట్లాడుతూ....బంతి మెరుపు కోసం లాలాజల వాడకాన్ని నిషేధించామని తెలిపారు. అంతేకాదు కోవిడ్ 19 నేపథ్యంలో ఆటలో మార్పులు రావడం ఖాయమని ఆయన అన్నారు. కుంబ్లే నేతృత్వంలోని కమిటీ లాలాజల వాడకాన్ని నిషేధించాలని సిఫారసు చేసింది. క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడానికి ఐసిసి తన మార్గదర్శకాలను విడుదల చేసింది. కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'తో మాట్లాడుతూ ఇది కేవలం మధ్యంతర చర్య అని, కొన్ని నెలలు లేదా సంవత్సరంలో ఈ విషయాలు అదుపులో ఉంటాయని ఆశిస్తున్నానని, అన్నారు. అంతేకాదు తదుపరి విషయాలు మునుపటిలాగే సాధారణంగా మారుతాయని కుంబ్లే అన్నారు.

లాలాజల నిషేధంపై బౌలర్లు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా బాల్ స్వింగ్ చేయడం కష్టతరం అవుతుందని అభిప్రాయం చెబుతున్నారు. మరికొంత మంది బౌలర్లు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరారు. అంతేకాదు బంతిని షైన్ చేయడానికి 'మైనం పూత' ఉపయోగించడం వంట అంశాలపై ఐసిసి ఆమోదించాలా, వద్దా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. బయటి పదార్థాల వాడకం గురించి ఇప్పటికే చర్చ జరిగిందని కుంబ్లే చెప్పారు. ఈ ఊహాగానాలపై కుంబ్లే మాట్లాడుతూ, బంతిని షైన్ చేయడం కోసం బయటి పదార్థాలను అనుమతించడం కుదరని పని అని చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మరియు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లను నిషేధించడానికి దారితీసిన 2018 బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్‌ను కుంబ్లే ఉదహరించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో ఏమి జరిగిందో ఐసిసి నిర్ణయించిందని, అయితే క్రికెట్ ఆస్ట్రేలియా కఠినమైన వైఖరిని తీసుకుందని, అందువల్ల మేము కూడా దీనిని పరిగణించామని ఆయన అన్నారు.
First published: May 25, 2020, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading