AFG vs WI : వరల్డ్ కప్‌ను విజయంతో ముగించిన వెస్టిండీస్.. 9వ మ్యాచ్‌లోనూ అఫ్ఘాన్ పరాజయం

ICC Cricket World Cup 2019 | వరల్డ్ కప్‌లో ఆడిన 9 లీగ్ మ్యాచ్‌ల్లోనూ అఫ్ఘనిస్తాన్ ఓటమి పాలైంది. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది.

news18-telugu
Updated: July 4, 2019, 10:59 PM IST
AFG vs WI : వరల్డ్ కప్‌ను విజయంతో ముగించిన వెస్టిండీస్.. 9వ మ్యాచ్‌లోనూ అఫ్ఘాన్ పరాజయం
వెస్టిండీస్ విజయోత్సాహం (Image:Cricket world cup/Twitter)
news18-telugu
Updated: July 4, 2019, 10:59 PM IST
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది వెస్టిండీస్.  అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆఖరి వన్డేలో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 311 పరుగుల లక్ష్యఛేదన కోసం రంగంలోకి దిగిన అఫ్ఘనిస్తాన్.. ఓ దశలో టార్గెట్‌ను ఛేదించేలా కనిపించింది. మొదట్లోనే వికెట్ కోల్పోయినా.. పట్టుదలతో ఆడింది. ఈ ప్రపంచ కప్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని అఫ్ఘనిస్తాన్... ఆఖరి మ్యాచ్‌లో గెలుస్తుందనే అభిప్రాయన్ని కలిగించింది. అయితే, టార్గెట్‌ను ఛేదించడంలో బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడడంతో క్యాచ్ అవుట్ అయ్యారు. అఫ్ఘాన్ ప్లేయర్లలో ఏడుగురు క్యాచ్ అవుట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్‌లో రహ్మత్ షా (62), ఇక్రమ్ (86), జద్రాన్ (31), అస్గర్ అఫ్ఘాన్ (40), అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత వచ్చినవారు సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. చివర్లో సిర్జాద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ మెరుపులు మెరిపిచే ప్రయత్నం చేసినా.. అఫ్ఘాన్‌కు విజయం దక్కలేదు. చివరకు 288 పరుగులకు అఫ్ఘాన్ ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో బ్రెత్‌వైట్ 4 వికెట్లు తీశాడు. రోచ్ 3 వికెట్లు, గేల్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 311/6 పరుగులు చేసింది. లెవిస్ (58), హోప్ (77), హెట్మెయిర్ (39), పూరన్ (58), హోల్డర్ (45), బ్రాత్ వైట్ (14) పరుగులు చేశారు. దీంతో స్కోర్ 311 పరుగులకు చేరింది. చివరి పది ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. అఫ్ఘాన్ బౌలర్లలో జద్రాన్ 2 వికెట్లు తీశాడు. సిర్జాద్, నబీ రిషాద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...