Home /News /sports /

CPL 2021 KIERON POLLARD GETS ANGRY ON UMPIRE AND FRUSTRATED WINDIES PLAYER DOES THIS WATCH VIDEO SRD

Viral Video : వైడ్ ఇవ్వని అంపైర్... కోపంలో పొలార్డ్‌ ఏం చేశాడో చూడండి..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)కి ఆడే పొలార్డ్‌ ఓసారి క్రిస్‌గేల్‌ (Chris Gayle)తో గొడవపడితే అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నోటికి ప్లాస్టర్ వేసుకుని మైదానంలోకి దిగిన పొలార్డ్ తన నిరసనని తెలియజేశాడు.

  కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (CPL) 2021లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్, ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) మరోసారి వార్తల్లో నిలిచాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో తరచూ గొడవపడే పొలార్డ్‌‌కి ఫీల్డ్ అంపైర్లు వార్నింగ్ ఇస్తుంటారు. ఆ హెచ్చరికలకి కూడా పొలార్డ్ తనదైన శైలిలో కౌంటర్లిస్తుంటాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)కి ఆడే పొలార్డ్‌ ఓసారి క్రిస్‌గేల్‌ (Chris Gayle)తో గొడవపడితే అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నోటికి ప్లాస్టర్ వేసుకుని మైదానంలోకి దిగిన పొలార్డ్ తన నిరసనని తెలియజేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ టైమ్‌లోనూ ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో.. తర్వాత బంతి కోసం వికెట్లని విడిచి వైడ్‌ లైన్‌పైకి వెళ్లి మరీ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంపైర్ల తప్పిదాల కారణంగా పొలార్డ్ గొడవపడిన సందర్భాలు కోకొల్లలు. ఇక, లేటెస్ట్ అంపైర్ తప్పిదం కారణంగా పొలార్డ్ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  వివరాల్లోకెళితే.. వైడ్ విషయంలో అంపైర్లు దాదాపు సరైన నిర్ణయమే తీసుకుంటారు. కానీ సీపీఎల్ 2021లో మాత్రం కళ్లెదుటే భారీ వైడ్ వెళ్లినా.. ఫీల్డ్ అంపైర్ సరైన బంతిగా ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సెయింట్ కిట్స్ వేదికగా మంగళవారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

  ఈ మ్యాచులో టాస్ ఓడిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్, టీమ్ సీఫెర్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదవ బంతిని పాకిస్తాన్ పేసర్ వాహబ్ రియాజ్ వేయగా.. సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు.పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన బంతిని సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. బంతి అందలేదు. వైడ్ లైన్‌కు బంతి దూరంగా వెళ్లినా.. అంపైర్ వైడ్ ఇవ్వలేదు.

  ఇది కూడా చదవండి : కీలక పోరు ముందు టీమిండియాను భయపెడుతున్న ఆ చెత్త రికార్డు.. గత 50 ఏళ్లుగా..

  దీంతో ఇది వైడ్ కాదా అంటూ సీఫెర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌బాగో కెప్టెన్ కీరన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో.. వికెట్లకు దూరంగా నడుచుకుంటూ వెళ్లిన పొలార్డ్ తన నిరసన వ్యక్తం చేశాడు. అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
  అంపైర్ నిగెల్ డుగుయిడ్ నిర్ణయం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆపై వాహబ్ రియాజ్ చివరి బంతి వేయడంతో ఆ ఓవర్ ముగిసింది. కీరన్ పొలార్డ్ అసహనంకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో చూసిన ఫాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. " అంపైర్ తప్పిదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి" అని ఒకరు కామెంట్ చేయగా.. " వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలని " ఇంకొకరు ట్వీటారు. మొత్తానికి ఫాన్స్ అంపైర్లపై మండిపడుతున్నారు.

  ఇది కూడా చదవండి :  దీపికా, లక్ష్మీ రాయ్, అసిన్ .. మిస్టర్ కూల్ ధోనీ డేటింగ్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ ఇదే ..

  ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్‌ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్‌), టిమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ కేస్రిక్ విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆండ్రీ ఫ్లెచర్ ( 55 బంతుల్లో 81; 6 ఫోర్లు, నాలుగ సిక్సర్లు) ఒంటరి పోరాటం వృధా అయ్యింది. రవి రాంపాల్ మూడు వికెట్లతో లూసియా కింగ్స్ పతనాన్ని శాసించాడు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Sports, Viral Videos, West Indies

  తదుపరి వార్తలు