కరోనా వల్ల భార్యను కలవలేకపోతున్న స్టార్ క్రికెటర్.. ఇంకా ఎన్ని రోజులు

జూలై 31 వరకు భారత్‌లో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఉంది. ఆ తర్వాత అనుమతిస్తారేమోనని మాలిక్ ఆశగా ఎదురుచూస్తున్నారు. జులై 31 వరకు వేచి చూద్దామని.. అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఎత్తివేస్తే, నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి భార్యను కలుద్దామని భావిస్తున్నారు.

news18-telugu
Updated: July 21, 2020, 6:26 PM IST
కరోనా వల్ల భార్యను కలవలేకపోతున్న స్టార్ క్రికెటర్.. ఇంకా ఎన్ని రోజులు
షోయబ్ మాలిక్
  • Share this:
కరోనా లాక్‌డౌన్ వల్ల అంతర్జాతీయ విమానాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వందే భారత్ మిషన్‌లో భాగంగా కొన్ని విమానాలను కేంద్రం నడుపుతోంది. కానీ ఇతర కమర్షియల్ ఫ్లైట్స్ ఎక్కడా ఎగరడం లేదు. ఈ ప్రభావం పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌పై తీవ్రంగా పడింది. భారత్‌లో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఉండడంతో షోయబ్ మాలిక తన భార్య, హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను కలవలేకపోతున్నారు. దాని వల్ల ఇంగ్లండ్ టూర్‌కు కూడా వెళ్లలేకపోతున్నారు.

పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌కు వెళ్లిపోయి ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. కానీ లాక్‌డౌన్ వల్ల పాకిస్తాన్‌లోనే ఉండిపోయిన మాలిక్.. ఇండియాకు వెళ్లి తన భార్యను కలిసిన తర్వాత ఇంగ్లండ్‌ వెళ్తానని పీసీబీ నుంచి అనుమతి తీసుకున్నాడు. జులై 24 లోపు భార్యను కలిసి అక్కడి నుంచి ఇంగ్లండ్ వెళ్లాలని పీసీబీ గడువు విధించింది. కానీ భారత్‌లో అంతర్జాతీయ విమానాలపై నిషేధం అమల్లో ఉండడంతో.. మాలిక్ హైదరాబాద్‌కు రాలేకపోతున్నారు. ఆయన భార్య సానియా మిర్జా, కుమారుడు ఇజాన్‌ను కలవలేకపోతున్నారు. ఐతే ఆగస్టు రెండో వారం వరకు మాలిక్‌కు గడువు ఇవ్వాలని పీసీబీ యోచిస్తోంది. ఈ క్రమంలో మాలిక్ ఇంగ్లండ్ టూర్ మరింత ఆలస్యం కానుంది.

భార్య సానియా మిర్జాతో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్(ఫైల్ ఫోటో)
భార్య సానియా మిర్జాతో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్(ఫైల్ ఫోటో)

సానియా సైతం ఎప్పుడెప్పుడు మాలిక్‌ వస్తాడా? అని ఎదురు చూస్తోంది. మార్చి నుంచి తన కొడుకు ఇజాన్.. తండ్రికి దూరంగా ఉంటున్నాడని, చాలా ఇబ్బందిగా ఉందని మే నెలలో ఆమె చెప్పింది. ఇక జూలై 31 వరకు భారత్‌లో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఉంది. ఆ తర్వాత అనుమతిస్తారేమోనని మాలిక్ ఆశగా ఎదురుచూస్తున్నారు. జులై 31 వరకు వేచి చూద్దామని.. అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఎత్తివేస్తే, నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి భార్యను కలుద్దామని భావిస్తున్నారు. కుటుంబంతో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి పాకిస్తాన్‌లో జట్టుతో కలవాలని యోచిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 21, 2020, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading