• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • COVID 19 EFFECT RAJASTHAN ROYALS ANNOUNCE CONTRIBUTION OF RS 7 5 CRORES FOR CORONA RELIEF SA

Rajasthan Royals: రాజస్థాన్‌ రాయల్స్‌ ఆపన్నహస్తం.. భారీ విరాళం ప్రకటించిన ఆర్ఆర్!

Rajasthan Royals

రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా తన వంత సహాయాన్ని ప్రకటించింది. కరోనా బాధితుల కోసం రూ.7.5కోట్లు విరాళంగా ప్రకటించింది. ఆక్సీజన్ సిలిండర్లు,వైద్య సహాయం లేక ఇబ్బంది

  • Share this:


    యావత్ భారతాన్ని కరోనా వణికిస్తోంది. వైరస్ బారిన పడిన వారు వసతులు లేక ఆపన్నహస్తల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో చాలా మంది దాతలు,దేశాధినేతలు తమ వంతుగా సహాయం అందిస్తున్నారు. ఇక క్రికెట్‌ ప్రపంచం తమవంతు సాయం చేసేందుకు కదిలివస్తోంది. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా తన వంత సహాయాన్ని ప్రకటించింది. కరోనా బాధితుల కోసం రూ.7.5కోట్లు విరాళంగా ప్రకటించింది. ఆక్సీజన్ సిలిండర్లు,వైద్య సహాయం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేసర్‌ కమిన్స్‌, ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌లీ తమవంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే

    "రాజస్థాన్‌ యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు కూడా విరాళాలు ప్రకటించారు. ఈ నిధులు దేశ వ్యాప్తంగా అపదలో ఉన్నవారికి అసరగా నిలుస్తాయి. ముఖ్యంగా రాజస్థాన్‌ రాష్ర్టంపై ప్రత్యేక దృష్టి సాధించాం. ప్రస్తుతం రంజిత్ బర్తాకుర్ అధ్యక్షతన ‘ఆర్ఆర్ఎఫ్’ (రాజస్థాన్‌ రాయల్స్ ఫౌండేషన్‌) ఎన్కో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కరోనా మూకుమ్మడి దాడి వల్ల దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలి పోయింది. కరోనా కారణంగా శ్యాస అందక ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్‌ అందించేందుకు ఆస్పత్రులు ఎంతో కష్టపడుతున్నాయి’’ అని రాజస్థాన్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
    Published by:Rekulapally Saichand
    First published: